గురుగ్రామ్‌లో ఒక సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రియుడిపైనే అత్యాచారం కేసు పెట్టింది. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి అసలు నిజాలను బయటపెట్టారు.
సోని దేవి పదహారేళ్ల వయసులోనే విక్రమ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వారిద్దరూ దాదాపు 18 ఏళ్లు సంతోషంగా జీవనం సాగించారు. అయితే, కాలక్రమేణా సోని దేవి మనసు పక్కనే ఉండే రవీంద్ర అనే వ్యక్తిపైకి మళ్లింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది.
ఈ వ్యవహారాన్ని సోని దేవి కుమార్తె గమనించింది. తల్లి ఫోన్‌లో ఇంటిమేట్ వీడియోలు చూసినట్లు తండ్రి విక్రమ్‌కు చెప్పింది. విక్రమ్ తన భార్య ఫోన్‌ను తనిఖీ చేయగా, అది నిజమేనని తేలింది. దీంతో విక్రమ్ తన భార్యపై తీవ్రంగా ఆగ్రహించి తిట్టాడు.
భర్త కోపం చూసి భయపడ్డ సోని దేవి, ప్రియుడు రవీంద్రతో కలిసి విక్రమ్‌ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. భర్త ఆఫీసు నుంచి బయటకు రాగానే, రవీంద్ర తన సహచరులతో కలిసి విక్రమ్‌ను కిడ్నాప్ చేశాడు. అదే రాత్రి విక్రమ్‌ను హత్య చేసి, ఒక గేటెడ్ కమ్యూనిటీ వెనకాల అతని మృతదేహాన్ని పాతిపెట్టారు.
హత్య తర్వాత, సోని దేవి తెలివిగా తన భర్త మిస్సింగ్ కేసు పెట్టింది. అంతేకాకుండా, సెక్స్ వీడియోలు బయటపడే అవకాశం ఉందని భావించి, ప్రియుడు రవీంద్రపైనే అత్యాచారం కేసు కూడా పెట్టింది.
సోని దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు రవీంద్రను అరెస్ట్ చేసి విచారించగా, అసలు నిజం బయటపడింది. భర్త విక్రమ్‌ను హత్య చేసింది సోని దేవి మరియు రవీంద్ర అని తేలింది. దీంతో పోలీసులు సోని దేవిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు గురుగ్రామ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…