Movie News

‘స్టుపిడ్ పొలిటీషియన్స్’ అంటూ రాజకీయ నాయకులపై రేణూ దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాలతో పరిచయమైన రేణూ, పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో విడిపోయిన తర్వాత, పవన్ కళ్యాణ్ మరోసారి పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రేణూ దేశాయ్ మాత్రం రెండో పెళ్లి చేసుకోకుండా, తన పిల్లలు ఆద్య, అకిరా నందన్‌లను చూసుకుంటూ జీవితం కొనసాగిస్తున్నారు. సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్న ఆమె, ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు.

సోషల్ మీడియాలో చురుకుగా.. రాజకీయ నాయకులపై ఆగ్రహం

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తూ, తన ఫాలోవర్స్‌ను కూడా విరాళాల కోసం ప్రోత్సహిస్తుంటారు. తరచూ సామాజిక విషయాలపై పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా రేణూ దేశాయ్ షేర్ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాజకీయ నాయకులపై ఆమె చేసిన ఘాటు విమర్శ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.

సరిస్కా టైగర్ రిజర్వ్‌పై రేణూ దేశాయ్ ఆవేదన

రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్‌లో మైనింగ్ చేయాలనే యోచనలపై రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఈ రిజర్వ్‌లో కేవలం 3 పులులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 50 దాటింది. ఇలాంటి కీలకమైన వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో మైనింగ్ చేయడం వల్ల మూగజీవాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె హెచ్చరించారు.

ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాశారు: “ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే నిజంగా స్టుపిడ్స్ అనిపిస్తుంది. చివరకు వన్యమృగాలను చంపే వరకు కూడా వీళ్లు ఆగేలా కనిపించడం లేదు. చివరి చెట్టును నరికే వరకు నిద్రపోయేలా కనిపించడం లేదు. ఆ పొలిటీషియన్లకు కూడా పిల్లలు, మనవళ్లు ఉన్నారు కదా! వారు కూడా ఇదే భూమ్మీద జీవించాల్సిందే కదా!” అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

అభిమానుల మద్దతు

రేణూ దేశాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ అభిమానులు, నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్లతో నిండిస్తున్నారు. జంతు ప్రాణాలను కాపాడాలని, అడవుల్ని రక్షించాలని రేణూ దేశాయ్ చేసిన విజ్ఞప్తిని చాలామంది ప్రశంసిస్తున్నారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago