GV Narayana : ‘అంతులేని కథ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు జీవీ నారాయణ రావు గారు ఆ సినిమా తరువాత హీరోగానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ప్రొడ్యూసర్ గా మారి చిరంజీవి గారితో దేవాంతకుడు, అలాగే ఫ్రెండ్స్ తో కలిసి యముడికి మొగుడు సినిమాలను తీసి మంచి హిట్స్ అందుకున్నారు. నటుడుగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గాను అలాగే రైటర్ గాను పలు సినిమాలకు పని చేసారు నారాయణ రావు గారు. ఆయన ప్రొడ్యూసర్ గా నిర్మించిన సినిమాల్లో తాను బాగా నష్టపోయిన సినిమాల గురించి ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆ సినిమాలో శారద అయ్యుంటే హిట్ అయ్యుండేది…
చిరంజీవి తో దేవాంతకుడు సినిమా నిర్మించి హిట్ కొట్టిన నారాయణ గారు ఆ తరువాత తమిళం లో హిట్ అయిన ఎస్ఏ చంద్ర శేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ‘వీటుకు ఓరు కన్నగి’ సినిమాను రీమేక్ చేస్తూ తెలుగులో ‘ఇంటికో రుద్రమ్మ’ పేరుతో తీశారు. ఆ సినిమాలో తమిళంలో సుజాత గారు నటించగా ఆమెనే తెలుగులోకి కూడా తీసుకోవడం వల్ల సినిమా ఆడలేదు. నిజానికి తమిళంలో సుజాత గారి ఇమేజ్ వేరు తెలుగులో ఆమెది సాఫ్ట్ ఇమేజ్ కావడం వల్ల ఆమెను హత్యలు చేసే పాత్రలో ఒప్పుకోలేదు. ఆ పాత్రకు ఆమెను కాకుండా శారద ను తీసుకుని ఉంటే సినిమా హిట్ అయ్యుండేదని నారాయణ గారు అభిప్రాయ పడ్డారు.
ఇక మా ఎన్నికల గొడవల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు అసోసియేషన్ పెట్టిన పన్నెండు ఏళ్ళ వరకు ఎలాంటి ఎన్నికలు జరగలేదు. కేవలం మేమే కొత్త వాళ్ళు వస్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అందరికీ అవకాశం ఇచ్చాం. అలా ఉంటే పద్ధతి బాగుంటుంది. ప్రతిసారి కొత్త వాళ్ళైతే రావాలి కానీ ఎలక్షన్ పెట్టి గొడవలు పెట్టుకుని పలుచన అవడం నాకు నచ్చలేదు అంటూ నారాయణ గారు అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…