Featured

GV Narayana Rao : నా ఫ్రెండ్స్ లో ఒకరు తమిళ్ లో సూపర్ స్టార్.. మరోకరు తెలుగులో మెగాస్టార్..నేను కేవలం ఇలా మిగిలిపోవడానికి కారణం. : జీవి నారాయణరావు.

GV Narayana Rao : తెలుగు చలన చిత్రసీమలో చాలామంది నటులు మంచి గుర్తింపు సాధించినప్పటికీ కొంతమందికి మాత్రం ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు అనేది రాదు. ఎందుకంటే వాళ్లకి తగ్గ క్యారెక్టర్ సినిమాల్లో పడకపోవచ్చు, అందుకే చాలా మంది నటులు వారిలో అద్భుతమైన నటన ప్రతిభ ఉన్నప్పటికీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోలేక పోతున్నారు. కొంతమంది మాత్రం హీరోలుగా ఇండస్ట్రీలో వెలిగిపోతూ ఉంటే కొందరు మాత్రం నటన బాగా వచ్చి కూడా సరైన క్యారెక్టర్ దొరక్క దానికోసం ఇంకా పరితపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో నారాయణరావు ఒకరు ఆయన బిఎస్సి చదువుతున్నప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇల్లు వదిలి మద్రాసుకి వచ్చి అక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తూ… ఆ తర్వాత ఏం జరిగిందనేది నారాయణరావు మాటల్లో…

సినిమాలంటే ఏదో పిచ్చి నటించాలన్న ఆతృత ఇవన్నీ నన్ను మద్రాస్ వరకు తీసుకొచ్చాయి. అలా నటనలో రెండు ఏళ్లపాటు శిక్షణ తీసుకున్నాను. కొత్త వాళ్లతో సినిమా తీస్తున్నానని దర్శకుడు ‌బాలచందర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు వచ్చారు. అక్కడ మా నటన చూసిన ఆయన తీయబోయే ‘అంతులేని కథ’ చిత్రంలో నాకు రజనీకాంత్ కి అవకాశం ఇచ్చారు. అలా మేమిద్దరం కలిసి “అంతులేని కథ” చిత్రంలో నటించాం. నాకు ఈ సినిమాకి స్టేట్ అవార్డు వచ్చింది. ఆ తరువాత ఈరాంకీశర్మ దర్శకత్వంలో విడుదలైన “చిలుకమ్మ చెప్పింది” చిత్రంలో నా పాత్రకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి దాదాపుగా నాకు పది అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత రంజిత్ కుమార్ నిర్మాణం, ఈరంకిశర్మ దర్శకత్వంలో ‘నాలాగ ఎందరో’ చిత్రంలో నేను నటించాను. ఆ సినిమాకి నాకు విపరీతమైన పేరు వచ్చింది. ఆ చిత్రానికి కూడా అవార్డులు వచ్చాయి.

ఆ తర్వాత బెంగాల్లో కఫాన్ అనే నవల ఆధారంగా తెలుగులో “ఒక ఊరి కథ” చిత్రంలో నేను నటించాను. ఈ సినిమాకి కేవలం భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ సినిమా అనేక ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడింది. చేకోస్లోవియా, న్యూయార్క్, ఫ్రాన్స్ లాంటి అనేక దేశాల్లో జరిగిన ఫెస్టివల్స్ కి నేను హాజరయ్యాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సంవత్సరం ఆ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి హాజరవ్వడానికే నాకు సమయం పట్టింది. ఆ తర్వాత కమర్షియల్ చిత్రాలు కాకుండా సెలెక్టివ్ గా మంచి కథా బలం ఉన్న పాత్రలనే ఎన్నుకున్నాను. అలా నాకు అవకాశాలు తగ్గడం మొదలుపెట్టాయి. కానీ నా స్నేహితులిద్దరూ రజనీకాంత్, చిరంజీవి కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ.. ఒకరు తమిళ్లో మరొకరు తెలుగులో నెంబర్ వన్ హీరోలుగా ఉండడం నాకు ఆనందంగా ఉందని ఆయన వివరించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

7 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

1 day ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

1 day ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

1 day ago