Chakri Brother: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి అందరికీ సుపరిచితమే ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు, శివమణి, సత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించారు.
ఇలా సంగీత దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చక్రి అనూహ్యంగా 2014వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు. ఇలా చక్రి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఇక తాజాగా ఈయన సోదరుడు మహిత్ నారాయణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చక్రి భార్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
అన్నయ్య చనిపోక ముందు మా కుటుంబంలో ఎలాంటి గొడవలు విభేదాలు లేవు అన్నయ్య చనిపోయిన తర్వాత ఆస్తి తగాదాలు వచ్చాయని తెలిపారు. అన్నయ్య చనిపోయారనే బాధ ఒకవైపు ఈ గొడవలు ఒకవైపు చాలా నరకంలా అనిపించిందని తెలిపారు.ఇక అన్నయ్య ఆస్తులలో కొన్నింటిని వదిన అమ్ముకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉంది.
ప్రస్తుతం మాకు ఆవిడతో ఏ విధమైనటువంటి సంబంధాలు లేవని మహిత్ వెల్లడించారు. ఇకమరి కొన్ని ఆస్తులు కోర్టులో ఉన్నాయని ఈ సందర్భంగా మహిత్ చక్రి భార్య గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన పరారీ అనే సినిమాకి సంగీతం అందించారు. ఇలా తన ఫ్యామిలీ గురించి మహిత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…