Featured

Jayasudha : మోహన్ బాబుతో అలా చేయడం అంటే ఇష్టం లేదు.. అందుకే పెదరాయుడు సినిమా వదులుకున్నాను. : జయసుధ

Jayasudha : రీమేక్ చిత్రాలు అనేవి ప్రతి సిని ఇండస్ట్రీలో కామన్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే కొత్త కథ, కొత్త స్క్రీన్ ప్లే సినిమాను హిట్ అయ్యేలా చేస్తాయో లేదో అనే డౌట్ తో చాలామంది దర్శక నిర్మాతలు రీమేక్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలా రీమేక్ చిత్రాలను రూపొందించడంలో దిట్టా రవిరాజ పినిశెట్టి. అంతకుముందు 1992 లో వచ్చిన “చంటి” తమిళంలోని “చిన్నతంబి” సినిమాకి రీమేక్. తెలుగులో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆయన మోహన్ బాబుతో “యమ్.ధర్మరాజు ఎంఏ” చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సొ సోగా ఆడింది.

అయితే ప్లాపులతో ఉన్న మోహన్ బాబును రజనీకాంత్ చెన్నైకి పిలిచి తమిళంలో హిట్ అయిన నట్టమై చిత్ర రీమేక్ హక్కులను కొనుక్కోమని చెప్పడంతో మోహన్ బాబు ఆ సినిమా రిమేక్ హక్కులను తీసుకున్నారు. అలా తీసుకొని తనతో ఇదివరకు సినిమాలు రూపొందించిన రవిరాజా పినిశెట్టిని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇక పాపారాయుడు పాత్రకి రజనీకాంత్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. పెదరాయుడి భార్యగా భానుప్రియ నటించగా చినరాయుడు(రాజా) భార్యగా సౌందర్య నటించారు. అయితే సినిమా నిర్మాణానికంటే ముందు పెదరాయుడు భార్యగా నటించడానికి దర్శక, నిర్మాతలు ముందుగా జయసుధను సంప్రదించారు. అప్పుడసలు ఏం జరిగిందనేది జయసుధ మాటల్లో…

పెదరాయుడు చిత్రంలో పెదరాయుడు భార్యగా నటించడానికి ముందుగా నన్ను సంప్రదించారు. సినిమా కథ బాగుంది. నాకు నచ్చింది కూడా కానీ మోహన్ బాబుతో ఒక పాటతో పాటు డాన్స్ కూడా ఉంటుంది అనడంతో నేను వెనక్కి తగ్గాను. ఈ వయసులో పాటలు, డాన్స్ చేయడం అనేది కుదరని పని. అందుకే పెదరాయుడు చిత్రంలో మోహన్ బాబు పక్కన నటించే అవకాశం వచ్చిన.. నేను చేయలేదు. నా స్థానంలో దర్శక, నిర్మాతలు భానుప్రియను తీసుకున్నారని సహజనటి జయసుధ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1995లో విడుదలైన పెదరాయుడు చిత్రం ఆ సంవత్సరానికి బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఫ్లాపులతో ఉన్న మోహన్ బాబు కి పెదరాయుడు చిత్రం చాలా మేరకు ఊరటనిచ్చిందనే చెప్పాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేసవి హీట్‌కు సహజ పరిష్కారం… ఈ పండు మీకు తెలుసా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…

26 minutes ago

ఉసిళ్లు తింటారా నిజంగా? ఆశ్చర్యపరిచే గ్రామీణ సంప్రదాయం!

వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…

31 minutes ago

ఎక్కువ ఉప్పు తింటే… ఎముకలు బలహీనమవుతాయా?

రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…

1 hour ago

సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధమా? దాగిన అర్థం తెలుసా!

హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…

1 hour ago

జీవితానికి అసలు అర్థం ఇదేనా? కృష్ణుడి తత్త్వం చెబుతున్న సత్యం!

ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…

2 hours ago

ఇంటి ఆవరణలో ఈ చెట్టు ఉంటే అదృష్టం మారుతుందా?

శమీ వృక్షం గురించి మన సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇది సాధారణంగా కనిపించే చెట్టు అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా మరియు…

2 hours ago