GV Narayana Rao : నవయుగ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జీవీ ప్రసాద్ గారి కొడుకు జీవీ నారాయణ రావు గారు, కే. బాలచందర్ గారి ‘అంతులేని కథ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన నారాయణ గారు, ఆ తరువాత సినిమా ప్రొడక్షన్ లో అడుగుపెట్టి యముడికి మొగుడు, చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకులు వంటి సినిమాలను నిర్మించారు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చాలా సినిమాల్లో నటించిన ఆయన ఇంట్రస్టింగ్ విషయాలను పలు ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు. ఇక చిరంజీవి గారితో అయనకున్న అనుబంధాన్ని పంచుకున్నానరు నారాయణరావు గారు.
ఇపుడు చిరంజీవి నాతో ఎలా ఉంటాడంటే…
సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్ లో రూమ్ లో ఉన్నపుడు చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ రూంమేట్స్ గా ఉండేవారు. నేను మా అక్కా వారి ఇంట్లో ఉంటూ వారిని కలిసేవాడిని, నలుగరం మంచి స్నేహితులం. ఇక స్నేహితుడిగా నాకు చిరు నాకు ఎప్పుడు విలువ ఇచ్చేవాడు. అందుకే యముడికి మొగుడు సినిమా స్నేహితుల కోసం చేసారు. ఇక కథ కూడా వినకుండా దేవాంతకుడు సినిమాను నేను వెళ్ళితే చేద్దామని డేట్స్ ఇచ్చాడు. కథ ఏంటి అని కూడా చూడలేదు.
తన బావమరిది అల్లు అరవింద్, ఇతర మేనేజర్లకు కూడా చెప్పకుండా నాకు సినిమా ఒకే చేసాడు అది తనకు నా మీద ఉన్న నమ్మకం. ఇక మెగాస్టార్ అయిపోయాక కూడా మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. అయితే ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉండి కలవక పోవచ్చు కానీ మా మధ్య అనుబంధం అలాగే ఉంది. ఇక ఎపుడైనా ఇబ్బంది వచ్చినపుడు అవసరం కోసం నేను ఎన్నడూ చిరంజీవి దగ్గరికి పోలేదు, అలా వెళితే మాది స్నేహం అనిపించుకోదు అంటూ వారి స్నేహం గురించి చెప్పారు నారాయణ గారు.
వేసవి వచ్చిందంటే పిల్లలకు సెలవులు, ఆటలు, సరదాలు మొదలవుతాయి. ఈ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ క్లాసులకు…
వేసవి కాలం వచ్చిందంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో…
హిందువుల అత్యంత పవిత్ర తీర్థయాత్రల్లో ఒకటిగా భావించే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2026…
ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని సింగరకొండ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ప్రకృతి అందాలను కలగలిపిన ఈ…
ఇటీవల కాలంలో జుట్టు రాలడం, పలచబడడం, పెరుగుదల మందగించడం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. కాలుష్యం, ఒత్తిడి,…
బరువు తగ్గాలనుకునే చాలా మంది ముందుగా చేసే మార్పు అన్నం మానేయడమే. “రైస్ తింటే వెంటనే బరువు పెరుగుతాం” అనే…