GV Narayana Rao : నవయుగ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జీవీ ప్రసాద్ గారి కొడుకు జీవీ నారాయణ రావు గారు, కే. బాలచందర్ గారి ‘అంతులేని కథ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన నారాయణ గారు, ఆ తరువాత సినిమా ప్రొడక్షన్ లో అడుగుపెట్టి యముడికి మొగుడు, చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకులు వంటి సినిమాలను నిర్మించారు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చాలా సినిమాల్లో నటించిన ఆయన ఇంట్రస్టింగ్ విషయాలను పలు ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు. ఇక చిరంజీవి గారితో అయనకున్న అనుబంధాన్ని పంచుకున్నానరు నారాయణరావు గారు.

ఇపుడు చిరంజీవి నాతో ఎలా ఉంటాడంటే…
సినిమాల్లో అవకాశాల కోసం మద్రాస్ లో రూమ్ లో ఉన్నపుడు చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ రూంమేట్స్ గా ఉండేవారు. నేను మా అక్కా వారి ఇంట్లో ఉంటూ వారిని కలిసేవాడిని, నలుగరం మంచి స్నేహితులం. ఇక స్నేహితుడిగా నాకు చిరు నాకు ఎప్పుడు విలువ ఇచ్చేవాడు. అందుకే యముడికి మొగుడు సినిమా స్నేహితుల కోసం చేసారు. ఇక కథ కూడా వినకుండా దేవాంతకుడు సినిమాను నేను వెళ్ళితే చేద్దామని డేట్స్ ఇచ్చాడు. కథ ఏంటి అని కూడా చూడలేదు.

తన బావమరిది అల్లు అరవింద్, ఇతర మేనేజర్లకు కూడా చెప్పకుండా నాకు సినిమా ఒకే చేసాడు అది తనకు నా మీద ఉన్న నమ్మకం. ఇక మెగాస్టార్ అయిపోయాక కూడా మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. అయితే ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉండి కలవక పోవచ్చు కానీ మా మధ్య అనుబంధం అలాగే ఉంది. ఇక ఎపుడైనా ఇబ్బంది వచ్చినపుడు అవసరం కోసం నేను ఎన్నడూ చిరంజీవి దగ్గరికి పోలేదు, అలా వెళితే మాది స్నేహం అనిపించుకోదు అంటూ వారి స్నేహం గురించి చెప్పారు నారాయణ గారు.






























