Featured

NTR & ANR : ఇండస్ట్రీ కి రెండు కళ్ళైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య అభిప్రాయ బేధాలు… ఆ ఒక్క సంఘటనతో కలిసి నటించలేదు…!

NTR & ANR : తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, సావిత్రి. ఇక మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లంటే తెలుగు ఇండస్ట్రీ కి రెండు కళ్ళ వంటి వారు. ఒకరు జానపదం, పౌరాణికం కి రారాజు అయితే మరొకరు సాంఘిక, కుటుంబ కథాచిత్రాల రారాజు. పౌరణికాల్లో తనకు పోటీ ఎవరు లేరని ఎన్టీఆర్ ముద్ర వేసుకుంటే, ప్రేమికుడి పాత్రలో తనకు సాటి లేడని నాగేశ్వరావు నిరూపించుకున్నారు. ఇద్దరూ అప్పట్లో పోటీ పడి నటించేవారు. ఇద్దరి సినిమాలకు గట్టి పోటీ ఉండేది. కానీ అలా పోటీ ఉన్న నటులైనా సుమారు 15 సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు ప్రేక్షకులను మెప్పించారు.

ఆ ఒక్క మాట, సంఘటన తో ఇద్దరి మధ్య మనస్పర్థలు…

ఇద్దరూ ఎంతో కలిసి మెలిసి ఉండే అగ్ర హీరోలీద్దరి మధ్య ఒకసారి మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయాన్ని రచయిత సీ నారాయణ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తావించారు. ఒక సినిమాలో కృష్ణుడు వేషం వేయాలని ఎన్టీఆర్ గారు నాగేశ్వరావు గారిని అడిగాడట. అయితే ఆ వేషం వేయనని ఆ ఒక్కటి అడగవద్దు మహానుభావ అని సున్నితంగా తిరస్కరించారట నాగేశ్వరావు గారు. అయినా ఎన్టీఆర్ వదలకుండా అప్పటి సీఎం జలగం వెంకట్రావు గారి చేత అడిగించారట అయినా ఫలితం లేకపోవడం వల్ల ఇక అప్పటి నుండి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందట.

ఇక ఆతరువాత ఇద్దరు కలిసి నటించకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాలు సీ నారాయణ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తావించారు. గులేభకావళి సినిమాకోసం పాట రాయమని ఎన్టీఆర్ అడిగితే నారాయణరెడ్డి గారు సినిమాలో అన్ని పాటలు ఇస్తే రాస్తానని చెప్పారట. తనకు మొదటి సినిమా అవ్వడం వల్ల అలా కండిషన్ పెట్టారట సీనారే. దీనికి ఎన్టీఆర్ ఒప్పుకుని మొత్తం పది పాటలు ఇచ్చారు. ఇక ఆ తరువాత కొద్ది రోజులకు నాగేశ్వరావు గారి సినిమాకు పాట రాయమని అవకాశం వస్తే వద్దని తిరస్కరించారట నారాయణ రెడ్డి గారు. ఒకవేళ నాగేశ్వరావు గారి సినిమా మొదట విడుదలయితే మొదటి సినిమా అనే క్రెడిట్ మీకు వస్తుంది, మొదటి సినిమా మీకు అని ఎన్టీఆర్ కి మాటిచ్చాను అందుకోసం మొత్తం సినిమాలో పాటలు అయన నాకే ఇచ్చాడు, ఇపుడు మాట తప్పినట్లవుతుంది అని తిరస్కరించాను. కానీ వారు మధ్య అభిప్రాయ బేధాలు ఉన్న సమయంలో కూడా వాళ్లిద్దరికి పాటలు రాశానని చెప్పారు నారాయణ రెడ్డి గారు.

Bhargavi

Recent Posts

సముద్ర మధ్యలో హంటా వైరస్ కలకలం.. అప్రమత్తమైన WHO, ప్రత్యేక ఆపరేషన్‌తో ప్రయాణికుల రక్షణ

అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఓ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ అనుమానిత కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది.…

9 minutes ago

విజయ్ సీఎం ఆశలకు గవర్నర్ బ్రేక్.. తమిళనాడులో రాజకీయ టెన్షన్!

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్న టీవీకే నేత విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర…

43 minutes ago

వేసవిలో ఈ డ్రింక్ తాగితే చాలు.. డీహైడ్రేషన్ నుంచి బరువు తగ్గే వరకు ఎన్నో ప్రయోజనాలు!

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న వేళ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో నీటితో పాటు ఆరోగ్యానికి మేలు…

4 hours ago

ఐస్ క్యూబ్స్ వాసనతో ఇబ్బందా? కిచెన్‌లో ఉన్న వాటితోనే సింపుల్ సొల్యూషన్!

ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఫ్రిజ్ వినియోగం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చల్లని నీరు, ఐస్ క్యూబ్స్ లేకుండా చాలామందికి రోజు…

4 hours ago

విఘ్నాలను తొలగించే మహా గణనాథుడు.. భక్తులతో కిటకిటలాడుతున్న తెలంగాణ క్షేత్రాలు!

విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యమైనా వినాయకుడి పూజతోనే ప్రారంభించడం ఆనవాయితీ.…

4 hours ago

సీతారాముల జ్ఞాపకాలతో నిండిన పవిత్ర క్షేత్రాలు.. ఒక్కసారి దర్శిస్తే చాలు!

భారతీయ సంస్కృతిలో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడి జీవితం ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. త్రేతాయుగంలో జరిగిన ఈ మహాగాథతో…

5 hours ago