Sri Divya : ఈ ఫొటోలోని చిన్నారి పాప, మూడేళ్ళ వయసునుండే నటించడం ప్రారంభించి, 2000 సంవత్సరంలో వచ్చిన హనుమాన్ జంక్షన్, మహేష్ బాబు హీరోగా వచ్చిన యువరాజ్ చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. తరువాత రవితేజ హీరోగా చేసిన వీడే సినిమాలో కూడా నటించింది. ఆ తరువాత 2010 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా నటించింది. తెలుగులో మరీ అంత గుర్తింపు రాకపోయినా తమిళ్ లో కార్తి, విశాల్, శివ కార్తికేయన్ వంటి హీరోల సరసన చేసింది. ఆ పాప ఎవరో కాదు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తెలుగుమ్మాయి శ్రీ దివ్య.
మాహిష్మతి సామ్రాజ్యంలో దేవసేనలా మారిపోయిందంటూ కామెంట్స్…
శ్రీ దివ్య.. బుల్లితెర మీద పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. అయితే రవి బాబు దర్శకత్వంలో వచ్చిన ‘మనసారా’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ‘బస్ స్టాప్’ సినిమాతో కమర్షియల్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, వారధి, కేరింత వంటి సినిమాలు చేసిన తరువాత తమిళ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. తమిళ్ లో పెన్సిల్, కాష్మోరా లో నటించింది కానీ తరువాత చాలా విరామం వచ్చింది. ఇపుడు ఇటీవల వచ్చిన మలయాళ సినిమా ‘జనగణమన’ లో నటించింది. ఇపుడు శ్రీదివ్య ఆశలు మలయాళ సినిమాల వైపే ఉన్నాయి.
అయితే సోషల్ మీడియాలో ఇపుడు మహేష్ బాబు శ్రీ దివ్య ని ఎత్తుకున్న ఫోటోని శ్రీ దివ్య ప్రస్తుత ఫోటోని పెట్టి కంపేర్ చేస్తున్నారు. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రీ దివ్య హీరోయిన్ కూడా అయిపోయింది. కానీ మహేష్ మాత్రం అలానే ఉన్నాడు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ‘శ్రీ దివ్య మాహిష్మతి సామ్రాజ్యంలో దేవసేనలా మారిపోయినా మహేష్ మాత్రం ఎప్పటికి ఏజ్ లెస్ గానే ఉండిపోతారేమో’ అని వారి అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు.
గుజరాత్‌లోని కష్టభంజన్ హనుమాన్ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయంలో హనుమంతుడి పాదాల చెంతనే శనిదేవుడు కొలువుదీరినట్లు…
మార్కెట్‌లో కనిపించే బొప్పాయిలు రంగు, ఆకారం చూసి చాలామంది వెంటనే కొనేస్తుంటారు. కానీ బయటకు ఆకర్షణీయంగా కనిపించే ప్రతి పండు…
చాలామంది పల్లీలను చిన్నపాటి స్నాక్‌గా మాత్రమే భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం వేరుశెనగలను పూర్తి స్థాయి పోషకాహారంగా గుర్తిస్తున్నారు.…
పూజా కార్యక్రమాల్లో హారతి అనేది ముఖ్యమైన భాగంగా భావిస్తారు. దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత కర్పూరం లేదా దీపంతో హారతి…
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం మన సంస్కృతిలో భాగం. అయితే కొన్ని ప్రత్యేక మొక్కలకు ఆధ్యాత్మికంగా, వాస్తు పరంగా కూడా…
ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026 సందర్భంగా శ్వాసకోశ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మే…