Rajani : రజని… బెంగుళూరులో పుట్టిన రజని మొదట తమిళ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. 1985 లో వచ్చిన ‘బ్రహ్మముడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో సుమారు 150 చిత్రాలలో నటించింది. బాలకృష్ణ తో ‘సీతా రామ కళ్యాణం’, నాగార్జునతో ‘మజ్ను’ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. రాజేంద్రప్రసాద్ హీరోగా ‘అహ నా పెళ్ళంట’ సినిమా మంచి విజయం సాధించింది. వీరిద్దరి జంట బాగా నవ్వులు పూయిస్తారు అని పేరు. అప్పట్లో తన నాచురల్ అందం తో టాప్ హీరోయిన్ గా వెలిగింది. 1998 లో వివాహసం చేసుకొని సినీ పరిశ్రమకు దూరం అయిపోయింది.
చేతిలో చిల్లి గవ్వ లేకుండా ముగ్గురు పిల్లలతో ఒంటరి పోరాటం…
1998 లో ముల్లగిరి ప్రవీణ్ అనే ఒక ఎన్నారై డాక్టర్ ను పెళ్లి చేసుకుంది, వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే సినిమా జీవితం సాగినట్టు ఈమె జీవితం సాఫీగా సాగలేదు. చాలా కష్టాలు అనుభవించిందట. పెళ్లి తరువాత రజని తాను కష్టపడి సినిమాలలో సంపాదించిన మొత్తాన్ని తన భర్త దగ్గరే పెట్టిందట. అయితే తన భర్త అత్త కలసి అదనపు కట్నం తేవాలని హింసించేవారట. తాను తన సంపాదనతో ముంబాయి లో కొన్న అపార్ట్మెంట్ సైతం తన అత్త పేరు మీద చేయించడం తో చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయిందట.
అక్కడితో ఆగకుండా తనపై తప్పుడు కేసులు కూడా పెట్టి వదిలించుకొనే ప్రయత్నం చేస్తున్నారని కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లల తో అత్తింటి నుండి విడిగా వచ్చి ఒంటరి పోరాటం చేస్తోంది. తాను సినిమాలలో కష్టపడి సంపాదించిన దానికోసం, తనకు రావాల్సిన దానికోసం కోర్టుల చుట్టూ తిరుగుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…