మనుషుల మధ్య ఏమైనా వాగ్వాదం చోటు చేసకుంటే ఒకరిపై ఒకరు పగ పట్టి ఏదో ఒక సందర్భంలో దెబ్బ కొడదామని భావిస్తారు. ఈ గొడవలోనే ఒకరిపై ఒకరు శపిస్తుంటారు. వారిపై ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటారు. అయితే ఇక్కడ చెప్పే ఓ మొక్క శపిస్తుందంట. ఆ మొక్క ఆకులను ముట్టుకుంటే నోప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడంట. ఆ స్థాయిలో ఉంటుందట ఆ మొక్క.
ఇంతకు ఆ మొక్క పేరు ఏంటంటే.. గింపీ-గింపీ (Gympie-Gympie). సైంటిఫిక్ పేరు డెండ్రోక్నైడ్ మొరాయిడెస్ (Dendrocnide Moroides).
చూడటానికి ఇది అందంగా ఉంటుంది. హార్ట్ షేప్‌లో పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. దాదాపు రావి ఆకుల్ని పోలి ఉంటాయి. దీన్ని సూసైడల్ ప్లాంట్ అని కూడా అంటారు. దీనిపై కంటికి కనిపించని ముళ్లు ఉంటాయి. ముళ్ల విషయం తెలియక పూర్వం దీన్ని చూసిన గిరిజనులు ఇది శపిస్తుందని అనుకునేవారు.
ఎందుకంటే దానిని ముట్టుకున్న తర్వాత వారు పడే బాధ అంతా ఇంతా కాదు. అందుకే ఈ మొక్క శపిస్తుందని అప్పట్లో అనుకునేవారంట. తేలు కుడితే ఎలా నొప్పి వస్తుందో… అలాంటి నొప్పి ఈ ముళ్లు గుచ్చుకుంటే కలుగుతుంది. ఈ ముళ్లు గుచ్చుకుంటే… బయటకు తియ్యడం కష్టం. అంత చిన్నగా ఉంటాయి. ఆ ముళ్లు తీసేదాకా నొప్పి తగ్గదు. అయితే ఈ మొక్కలు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఓ రోజు క్వాన్స్‌లాండ్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్‌కి చెందిన సీనియర్ కన్సర్వేషన్ ఆఫీసర్… ఎర్నీ రైడర్ ఈ మొక్క ఆకుల్ని టచ్ చేశాడు.
రెండు గంటల తర్వాత అతడు ఆ నొప్పి భరించలేక అపస్మార స్థితిలోకి వెళ్లాడు. ఆ నొప్పి రెండు సంవత్సరాల వరకు ఉందని ఆయన పేర్కొన్నాడు. ఆ ముళ్లను భయటకు తీసేవరకు తవ్రమైన నొప్పి ఉంటుందని ఆయన తెలిపాడు. అయితే వీటికి ఎలాంటి ట్రీట్ మెంట్ లేదు. ఒకవేళ చిన్ని చిన్ని చికిత్సలు చేస్తున్నా అవి కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమే అని పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…