Categories: Movie News

Harichandhra Rao : శోభన్ బాబుని, దాసరి గారిని నక్సలైట్స్ అడవుల్లోకి తీసుకెళ్లారు.. బొబ్బిలి పులి సినిమాకు అదే నాంది..

Director Nandam Harichandhra Rao : దాసరి గారి శిష్యుడు గా తెలుగు ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా వచ్చిన వారిలో నందం హరిశ్చంద్ర రావు ఒకరు. 1973లో చాలా యాదృచ్చికంగా ఇండస్ట్రీ లోకి వచ్చారు. తండ్రి స్నేహితుడైన ఎంకే మౌళి అనే ఆయన అప్పటికే నిర్మాతగా తెలుగులో ‘స్వర్గం నరకం’ సినిమా తీశారు. ఆయన దాసరి గారికి బాగా సన్నిహితంగా ఉండేవారు. బావ గారు చెల్లి అంటూ దాసరి గారిని ఆయన భార్యను పిలిచేవారట మౌళి గారు. అలా ఆయన ద్వారా దాసరి వద్దకు చేరానని హరిశ్చంద్ర గారు వివరించారు. అప్పటికి దాసరి గారు ‘తాత మనవడు’ సినిమా మంచి హిట్ తో ఉండగా ఆయన నెక్స్ట్ సినిమా ‘సంసార సాగరం’ సినిమాకు అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన హరిశ్చంద్ర గారు ఇక అప్పటి నుండి దాసరి గారి వెన్నంటే ఉన్న శిష్యులలో ఒకరు. అయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు దాసరి గారి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘బొబ్బిలి పులి’ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దాసరి గారు, శోభన్ బాబు గారి కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషన్ సినిమా ‘గోరింటాకు’. ఆ సినిమా షూటింగ్ సమయంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ చేసారు. ఆ సమయంలో శోభన్ బాబు గారు దాసరి గారు అడవిలోనే అతిధి గృహంలో ఉంటూ షూటింగ్ సాగిస్తున్న సమయంలో చాలా మంది అభిమానులు షూటింగ్ చూడటానికి వచ్చేవారు. అలా కొంతమంది యువకులు రోజు వచ్చేవారట. వారిని గమనించిన హీరో, డైరెక్టర్ గారు పిలిచి ఎందుకు రోజూ వస్తున్నారని షూటింగ్ అయ్యాక అడుగుతూ సరదాగా కబుర్లు చెబుతుండగా గెస్ట్ హౌస్ దగ్గర పెద్దపులి వస్తుంది అని ఆ యువకులు చెప్పారట. శోభన్ బాబు, దాసరి గారు పెద్దపులి చూపిస్తారా అని అడుగగా వారు కొంత దూరం అడవిలోకి తీసుకెళ్లి ఒక వాగు వద్ద కాసేపు ఎదురు చూసినా పెద్ద పులి రాకపోయే సరికి వెనక్కి వచ్చేసారు.

వారి కథే బొబ్బిలి పులికి స్ఫూర్తి…

ఆ తరువాత కొద్ది రోజులు ఆ యువకులు మళ్ళీ షూటింగ్ వద్దకు రాకపోయేసరికి అక్కడి వ్యక్తిని అడుగగా వాళ్ళు నక్సలైట్స్ అంటూ చెప్పడంతో ఇద్దరు షాక్ అయ్యారట. ఆ తరువాత మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఆ యువకులు వచ్చినపుడు మీరు నక్సలైట్లా అని దాసరి గారు అడిగి, చదువుకున్న యువకులు ఎందుకు నక్సలైట్లగా మారారు అనే విషయం అడిగి తెలుసుకుని వారి అనుభవాలతోనే ‘బొబ్బిలి పులి’ సినిమా మొదలు పెట్టారట. ఆ నాడు వారికి మీ కథను తన తదుపరి చిత్రం కోసం వాడుకుంటానని చెప్పారట. అలానే ఆయన ఎన్టీఆర్ తో బొబ్బిలి పులి సినిమా తీసి సామాజిక సమస్యలను అద్భుతంగా నాటకీయంగా సినిమా లో చూపించి అద్భుత విజయం అందుకున్నారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago