Sudheer Babu: మహేష్ బాబు బావగా ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈయన తన బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా విభిన్న కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక సుధీర్ బాబు ఇప్పటికే పలు సినిమాలలో నటించిన ఈయన మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి.
ఇలా నటుడిగా వరుస విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుధీర్ బాబు త్వరలోనే హరోం హర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జ్ఞానసాగర్ దర్శకత్వంలో మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాపై సుధీర్ బాబు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మహేష్ బాబు గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. మహేష్ బాబు ఈయన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు లేదంటే వేడుకలకు కూడా హాజరుకారు. అలా తన సినిమాలకు మహేష్ బాబు ఎందుకు రాడు అనే విషయాల గురించి మాట్లాడారు.
ఆయన పేరు వాడాలనుకోలేదు..
మహేష్ బాబు నేను హీరోగా వచ్చిన మొదట్లో ఒక నాలుగైదు సినిమాల వేడుకలకి వచ్చారు..ఒక స్థాయికి వచ్చేవరకు మాత్రమే నేను మహేశ్ సాయం తీసుకున్నాను. ఆ తరువాత కూడా ఆయన పేరును వాడుకుంటూ ఎదగాలని నేను అనుకోలేదు. ఇక ఒక కో స్టార్ గా .. బంధువుగా కూడా మహేశ్ చేసే సూచనలు కూడా సింపుల్ గానే ఉంటాయని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…