Harshavardhan : బుల్లి తెర పై ‘రుతు రాగాలు’ ‘అమృతం’ వంటి సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన హర్షవర్ధన్ సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తూ వస్తున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం హర్ష వర్ధన్ ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్. ద్రోణ, విశాఖ ఎక్స్ ప్రెస్, చిన్నదానా నీకోసం, తిక్క వంటి సినిమాలకు పూర్తిగా రైటర్ గా పనిచేయకపోయినా డైలాగ్స్ రాసిచ్చారు. ఇక గుండె జారి గల్లంతయ్యిందే సినిమాకు పూర్తి స్థాయిలు స్క్రిప్ట్ రాసారు. ఇక మనం సినిమాకు కూడా పనిచేసిన హర్షవర్ధన్ పై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి.
నా దగ్గరికి స్క్రిప్ట్ వస్తే మొత్తం మార్చేస్తా….
తన దగ్గరికి స్క్రిప్ట్ వర్క్ కోసం వెళితే స్టోరీని మార్చేస్తారనే టాక్ హర్షవర్ధన్ పై ఉంది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ హర్షవర్ధన్ నాదగ్గర చాలా ఆలోచనలు వస్తుంటాయి. నా స్క్రిప్ట్ ఎక్కువ రోజులు నా దగ్గర ఉంటే దాంట్లో కూడా మార్పులు చేస్తుంటా, అలా వేరే కథల విషయాల్లో కూడా ఇదే జరిగింది. నచ్చితే వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే లేదు. అన్నట్లుగానే మారుస్తుంటా అలానే గుండె జారీ గల్లంతయ్యిందే సినిమా విషయంలో స్క్రిప్ట్ 90% వరకు మార్చాను కానీ సినిమా డైరెక్టర్ దాన్ని ఒప్పుకోవడం గొప్ప విషయం. నేనైతే అలా నా కథను మార్పు చేస్తే ఒప్పుకొనేమో అని అభిప్రాయపడ్డారు. ఇక మనం సినిమా విషయంలో నాగార్జున గారికి స్క్రిప్ట్ పని ఎవరు చేసినా నచ్చలేదు.
అప్పటికే ఏడాది గడిచిపోవడంతో విక్రమ్ కుమార్ గారు ఇష్క్ సమయంలో నాతో పని చేయించుకున్నారు కాబట్టి నన్ను పిలిచారు. ఒక మూడు సన్నివేశాలు రాయమని మొదట నాగార్జున గారు చెప్పారు. రాసాక అవి నచ్చి మనం లో ఛాన్స్ ఇచ్చారు. నా విషయంలో నాగార్జున గారు చాలా రిస్క్ చేసారు అంటూ చెప్పారు. ఇక నా స్క్రిప్ట్ ను కాపీ చేసి నా పేరు వేయకుండా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి కానీ నేను యాక్టర్ గా బాగానే సంపాదిస్తున్నాను కాబట్టి ఆ విషయాలని పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం సుధీర్ బాబు సినిమాకు స్క్రిప్ట్ పనులు చేస్తున్నానని చెప్పారు. తన స్క్రిప్ట్ విషయంలో హీరోలు గాని, డైరెక్టర్లు గాని వేలు పెడితే అలుగుతారని, కోపం తెచ్చుకుంటారని ప్రశ్న ఎదురుకాగా ఎవరైనా నా స్క్రిప్ట్ లో మార్పులు చెబితే ఆహ్వానిస్తానని, అందులో నాకు ఎలాంటి సమస్య లేదు కాకపోతే మూల కథ దెబ్బ తినకుండా మార్పులు ఓకే అంటూ తన మీద ఉన్న విమర్శలకు చెక్ పెట్టారు హర్షవర్ధన్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…