Categories: General News

పోలీస్ స్టేషన్లను సెటిల్‌మెంట్ అడ్డాలుగా మార్చారా? హైకోర్టు ఆగ్రహం!

తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్‌ వ్యవస్థపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పోలీస్‌ స్టేషన్లు చట్టాన్ని అమలు చేసే కేంద్రాలుగా కాకుండా, భూ వివాదాల సెటిల్‌మెంట్‌ కేంద్రాలుగా మారిపోతున్నాయన్న ఆరోపణలపై కోర్టు సీరియస్ అయింది.. కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్‌ ఉత్తర్వులను కూడా పోలీసులు పట్టించుకోకుండా జోక్యాలు చేస్తున్నారని పలు పిటిషన్లలో ఆరోపణలు రావడంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Have police stations been turned into settlement barriers? High Court Serious!

భూమి వివాదంలో పోలీసుల పాత్రపై కోర్టు ప్రశ్నలు
హైదరాబాద్‌ నాగోల్‌కు చెందిన సుదర్శనం అనే బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వాదనం ప్రకారం, బండ్లగూడ కృషినగర్‌లో ఉన్న ప్లాట్‌ నంబర్‌ 65 విషయంలో నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన సివిల్‌ మరియు క్రిమినల్‌ కేసులను సొల్వ్ చేయాలంటే రూ.55 లక్షలు రియల్ ఎస్టేట్‌ ఏజెంట్లకు చెల్లించాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ తడకమల్ల వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ, “ఇలాంటి ఘటనలు చూస్తుంటే పోలీస్ స్టేషన్లు చట్టాన్ని కాపాడే ప్రదేశాలు కాకుండా, సెటిల్‌మెంట్ కేంద్రాలుగా మారుతున్నాయన్న అభిప్రాయం కలుగుతుంది” అని వ్యాఖ్యానించారు.

హైకోర్టు పలు కీలక ఆదేశాలను ఇచ్చింది:

సివిల్‌ అంశాలలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని డీజీపీ కార్యాలయం నుంచి స్పష్టమైన సర్క్యులర్‌ జారీ చేయాలని సూచించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించింది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా “మేమే అసలైన హక్కుదారులం” అని చెప్పటం సరికాదని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా గుర్తు చేసింది. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సంబంధిత నిబంధనలను పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని, అన్ని స్టేషన్లలోనూ స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది.

ఈ కేసులో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వర్చువల్‌గా హాజరయ్యారు. నాగోల్ సీఐ స్వయంగా కోర్టులో హాజరయ్యారు. కోర్టు “పోలీస్‌ స్టేషన్‌ను భూ వివాదాల సెటిల్‌మెంట్‌ కేంద్రంగా మార్చడం ఏమిటి?” అని ప్రశ్నించింది. అలాగే, సంబంధిత సీసీ టీవీ ఫుటేజ్‌ను సమర్పించాలంటూ ఆదేశిస్తూ, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఈ వ్యాఖ్యలు, ఆదేశాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ నైతికంగా, చట్టపరంగా ఎలా ఉండాలో గుర్తుచేసే విధంగా హైకోర్టు ఈ తీర్పు నిలిచింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago