ప్రస్తుత జీవన విధానంలో వ్యాయామం చేసే అంత ఓపిక, తీరిక చాలామందికి ఉండటం లేదు. లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది ఎంత మత్రం మంచిది కాదు. ప్రతీ రోజు వ్యాయామం చేయడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో ముఖ్యంగా నడక అనేది చాలా ముఖ్యం.
రోజుకు కనీసం ఒక 30 నిమిషాల వరకైనా నడవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అనేక హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులకు నడక చెక్ పెడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకే నడక అనేది మన రోజువారి దినచర్యలో భాగంగా చేసుకుంటే మంచిది. ఓకే దగ్గర కూర్చునే వారికి రక్తపోటు పెరుగుతుంది.
దీంతో కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదకరమైనది. అందుకే గంటకు ఒకసారైనా లేచి 5 నిమిషాల వరకు రెస్ట్ తీసుకోవడం మంచిది. 30 నిమిషాల నడక కూడా మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. దీని ద్వారా మీ శరీరంలోని క్యాలరీలను బర్న్ చేసుకోని బరువు తగ్గించుకోవచ్చు. అంతేకాక హృదయ స్పందన రేటును మెరుగుపర్చుకోవచ్చు. ఇది మీ కండరాలు బాగా పనిచేయడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి బాగా సహకరిస్తుంది.
ఓకేసారి ఎక్కుసేపు నడిచే బదులు 5 నిమిషాలపాటు అనేక సార్లు నడవడం ప్రారంభిస్తే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారు పని మధ్యలో కాస్త విరామం తీసుకొని నడిస్తే చాలా ఉపయోగం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…