Nagachaitanya: ఆ లక్షణాలన్నీ అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Nagachaitanya: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు నాగచైతన్య ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతోమంది సక్సెస్ అందుకున్నారు. నటుడిగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాగచైతన్య తన తాతయ్యల గురించి అలాగే తన తల్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను చిన్నప్పటి నుంచి తన తాతయ్యలు రామానాయుడు నాగేశ్వరరావు గారి నుంచి ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు. ముఖ్యంగా వారు సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతూ ఉండేవారు ఒకరు మనకు సమయం ఇచ్చారు అంటే వారు ఎన్నో పనులను మానుకొని వస్తుంటారని అందుకే మనం సమయానికి రెస్పెక్ట్ ఇవ్వాలని తాతయ్య వాళ్ళు చెబుతూ ఉండేవారని తెలిపారు.

ఇక తాను 18 సంవత్సరాల వరకు అమ్మ దగ్గరే పెరిగాను. అమ్మ నన్ను పెంచింది. అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎతిక్స్ ఫాలో అవుతారు. క్రమశిక్షణ, టైం సెన్స్, ఒక పర్సన్ కు రెస్పెక్ట్ ఇవన్నీ అమ్మే నేర్పించారు. మీలో సెన్సిటివ్ నెస్, కొంచెం మీలో మీకు మాత్రమే సర్కిల్ గీసుకుంటూ ఉండిపోయేది అంతా అమ్మ నుంచే వచ్చాయా అని యాంకర్ అడగ్గా.. లేదు అని చైతూ చెప్పాడు.

స్నేహితులు ఎక్కువగా లేరు..
చిన్నప్పుడు నాకు చాలా సిగ్గు ఎక్కువ అందుకే ఎవరి దగ్గర ఏ విషయాల గురించి ఓపెన్ కానని తెలిపారు. నాకు బాగా కంఫర్ట్ ఉన్న వారి దగ్గర మాత్రమే నా విషయాలన్నీ చెప్పుకునేవాడిని. ఇక అందరిలాగా నాకు 30, 40 మంది ఫ్రెండ్స్ ఉండాలని ఎప్పుడూ కోరుకోను. ఉన్నది ముగ్గురు నలుగురు ఆయన చాలా నిజాయితీగా ఉండాలని నేను చేసే ఏ విషయమైనా ఇది తప్పు ఒప్పు అని చెప్పే స్నేహితులు ఉంటే చాలని అందుకే తనకు ఎక్కువగా స్నేహితులు లేరని నాగచైతన్య ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.