Game Changer: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. చివరగా ఆర్ఆర్ఆర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించడంతో పాటు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రామచరణ్. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా నడుపుతున్నారు. అయితే గత మూడేళ్ళుగా చిత్రీకరణ జారుకుంటూనే ఉన్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతోంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథని అందిస్తున్నారు. బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు అవుతున్న కూడా ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ లు లేవు. దాంతో దర్శకుడు శంకర్ పై చెర్రీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఎట్టకేలకు అభిమానులకు శుభవార్త చెబుతూ ఈ సినిమా నుంచి మొదటి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే రేపు అనగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి..అనే పాటను విడుదల చేస్తున్నారు.
150 థియేటర్స్‌లో
150 థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావు కరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం చెర్రీ అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. మరి ఈ పాట ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ఫోటోలు విడుదల కాగా ఆ ఫోటోలకు అభిమానుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…