Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాలో నటించినందుకుగాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అవార్డు ఏ హీరో అందుకోలేదని, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి తొలి హీరోగా అల్లు అర్జున్ గుర్తింపు పొందారు.
ఇలా పుష్ప సినిమాలోని తన నటనకు ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకోవడమే కాకుండా మరో అరుదైన గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయిలోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈ మైనపు విగ్రహం తయారు చేయడం పూర్తి అయిందని ఈనెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు ఈ విగ్రహం అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ కుటుంబం మొత్తం దుబాయ్ చేరుకున్నారు. అయితే ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రభాస్ మహేష్ బాబు వంటి హీరోల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు అయితే అవి లండన్ లో ఉన్నాయి.
గోల్డ్ వీసా…
ఇక దుబాయిలో ఈ మ్యూజియంలో ఇప్పటివరకు ఏ సౌత్ సినీ సెలబ్రిటీల విగ్రహాలను ఏర్పాటు చేయలేదు మొదటిసారి అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈయన మరో ఘనత సొంతం చేసుకున్నారు. ఇక ఈ విగ్రహా ఏర్పాటు మాత్రమే కాకుండా దుబాయ్ గోల్డ్ వీసా అందుకున్నటువంటి తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ ఘనత సాధించడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…