Uday Kiran: ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిత్రం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎంతో మచ్చ సక్సెస్ అందుకున్నారు. అయితే ఉన్నఫలంగా ఈయనకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆత్మహత్య చేసుకుని మరణించారు.
ఈ విధంగా ఉదయ్ కిరణ్ మరణించడంతో ఈయన మరణానికి చిరంజీవి కారణమంటూ ఇప్పటికీ చిరంజీవి అంటే సరిపోని వారు కామెంట్లో చేస్తూ ఉంటారు తన కుమార్తెతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నందుకే ఈయనని ఇండస్ట్రీలో ఎదగకుండా చేసే అవకాశాలు లేకుండా ఇబ్బందులకు గురి చేశారని అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పలువురు భావిస్తూ ఉంటారు.
అయితే తాజగా ఈయన నటించిన నువ్వు నేను సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఉదయ్ కిరణ్ గురించి చిరంజీవి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి సపోర్ట్ చేశారు..
చిన్నప్పటి నుంచి ఉదయ్ కిరణ్ చిరంజీవికి పెద్ద అభిమాని చిరంజీవి గారి తన గాడ్ ఫాదర్ తనని ఒక్కసారి కలిస్తే చాలు అని భావించేవారు ఒక ఈవెంట్లో చిరంజీవి గారితో కలిసిన సమయంలో ఉదయ్ ఎంతో సంతోషించారని తెలిపారు. అయితే ఉదయ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారు చాలా సపోర్ట్ చేశారంటూ శ్రీదేవి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…