Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..
ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా పట్ల ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి అయితే ఈ సినిమాలో రిపోర్టర్ గా నటిస్తున్నటువంటి బిగ్ బాస్ బ్యూటీ దివి ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా దివి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తను రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నానని తెలిపారు రిపోర్టర్ గా నటించడం అంటే మామూలు విషయం కాదని కొన్ని సన్నివేశాలలో నిజమైన రిపోర్టర్స్ తో కలిసిన నటించాల్సి వచ్చిందని ఈమె తెలియజేసారు ఇక సుకుమార్ గారు చిన్న సన్నివేశమైన చాలా పర్ఫెక్ట్ గా రావాలని భావిస్తారు అందుకోసం ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటారని తెలిపారు.
40 టేకులు…
ఒక సన్నివేషంలో అల్లు అర్జున్ దాదాపు 40 టేకులు తీసుకున్నారని ఈ షార్ట్ కంప్లీటవ్వడం కోసం సుకుమార్ గారు అల్లు అర్జున్ ఎండలో దాదాపు 3 గంటల పాటు నిలబెట్టారు అంటూ సుకుమార్ ఫర్ఫెక్షన్ గురించి ఈ సందర్భంగా దివి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…