Barrelakka: బర్రెలక్క అలియాస్ శిరీష పరిచయం అవసరం లేని పేరు. ఈమె బర్రెలు కాసుకుంటూ ఉన్నాను అంటూ ఒక వీడియోని షేర్ చేస్తూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంస్టాగ్రామ్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు..
ఇలా యూట్యూబర్ గా మాత్రమే కాకుండా ఈమె ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో ఈమె ఓటమి పాలైనప్పటికీ తన ప్రయత్నం మానుకోనని ఈసారి జరగబోయే ఎంపీ ఎన్నికలలో కూడా పోటీ చేస్తానని చెప్పుకోవచ్చారు. ఇదిలా ఉండగా ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్నటువంటి బర్రెలక్క త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. మార్చి 28వ తేదీ ఈమె పెళ్లి జరగబోతుంది తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు వెంకటేష్ అని తెలిపారు. అయితే తాజాగా తనకు కాబోయే భర్తను ఈమె పరిచయం చేశారు. పెళ్లికి ముందే వీరిద్దరూ ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకున్నారని తెలుస్తోంది అందుకు సంబంధించిన వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు..
ఫ్రీ వెడ్డింగ్ షూట్..
ఇక తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు వెంకటేష్ అని తమ వివాహం 28వ తేదీ మార్చి జరగబోతుందని వెల్లడించారు. ఇక ఆ అబ్బాయి తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన అబ్బాయని వెల్లడించారు. ఇక తాను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశారని ఈమె చెప్పుకొచ్చారు కానీ తన వృత్తి ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…