Hero Jagapathi Babu : ఇద్దరి హీరోయిన్లతో రొమాన్స్ చేసే హీరోగా అప్పట్లో శోభన్ బాబు గారు పేరు తెచ్చుకుంటే ఆ తారువాత తరం హీరోల్లో మాత్రం ఆ పేరు జగప్తి బాబు గారు తెచ్చుకున్నారు. సొంతంగా జగపతి ఆర్ట్స్ బ్యానర్ ఉండి కూడా స్వతహాగా కష్టపడి సినిమాల్లో ఎదిగిన హీరో జగపతి బాబు. మొదట్లో ఫ్యామిలీ సినిమాలతో బాగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్న జగపతి బాబు మరోవైపు మాస్ గా గాయం, అంతఃపురం వంటి సినిమాలలో కూడా నటించారు. ఇక అరవై ఏళ్లకు చేరుకున్న జగపతి బాబు ప్రస్తుతం భాషాబేధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ సినిమాలను చేస్తున్నారు. ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ సినిమాలను చేయాలనేది కోరిక అంటూ చెప్పారు.
నాగార్జున కి లెక్కుంది… నాకా లెక్కలేదు…
ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న జగపతి బాబు అనుకుని ఉంటే ఈపాటికి అందరిలాగ 1000 కోట్లు సంపాదించేవాడు, అయితే డబ్బు గురించి లెక్కలు వేయడం దాచుకోవడం రాకపోవడం వల్ల అంత ఆస్తులు సంపాదించలేదంటూ చెప్పారు. తనతో పాటు ఉన్న సమకాలిన హీరోల్లో అందరికంటే తక్కువగానే సంపాదించిన జగపతి బాబు అప్పటి హీరోల్లో నాగార్జున కు సంపాదించడం వచ్చు అలాగే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలుసు అంటూ చెప్పారు.
చాలా మంది ఆర్టిస్తులు డబ్బు సంపాదనలో పడి జీవితం ఏంటో మర్చిపోయారు. కానీ నాగార్జున సంపాదిస్తూనే ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ చెప్పారు. తనకు డబ్బుల విషయంలో లెక్క తెలియదని, ఒకేఒక ఆలోచన మాత్రం ఉందని ఒక 30 కోట్లు సంపాదిస్తే నా భార్య పిల్లలు హ్యాపీగా బ్రతుకుతారు, అంత సంపాదిస్తే చాలు ఆపైన సంపాదిస్తే అది బోనస్ అనుకున్నాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…