Featured

Divyavani : మా ఆస్తి కోసం నా కొడుకు మీద వాళ్ళు చేతబడి చేసారు…: దివ్యవాణి

Divyavani : తెలుగింటి బాపు బొమ్మ దివ్యవాణి అంటే అప్పట్లో అందరూ ఫిదా అయ్యేవారు. చామనచాయలో గడుసు తనం, పెద్ధ కళ్ళు వాలు జడతో అందరినీ ఆకట్టుకున్న ఈ తెలుగు బొమ్మ చేసింది కొన్ని సినిమాలే అయినా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయేలా ఆ సినిమాలలో పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘పెళ్లి పుస్తకం’ లో సత్యభామ గా ఆమె నటన ఎవరూ మర్చిపోలేరు. ఇక ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ వంటి సినిమాలలో కూడా అందరినీ ఆకట్టుకుంది దివ్యవాణి. హీరోయిన్ గా బాగా ఉన్నపుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన దివ్యవాణి పిల్లలు పుట్టాక హిందూ నుండి క్రిస్టియానిటీ కి మారిపోయింది. అలా ఎందుకు మారింది ఏ విషయాలు క్రీస్తు వైపుకు ఆమెను నడిపించాయి అన్నది తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

మా బంధువులే చేతబడి చేశారు…

దివ్యవాణి క్రీస్తును నమ్మడానికి బలమైన కారణం తన కొడుకు అంటూ చెప్పారు. పెళ్లి జరిగిన తరువాత నేను తెలుగు మా అయన కన్నడ వ్యక్తి అవడంతో గొడవలు జరిగాయని, అత్తింటి వాళ్లలో కొంతమందికి నేను నచ్చలేదు. దీంతో పెళ్లైన కొద్ది రోజులకే గొడవలు అన్ని జరగడం వల్ల నేను అతింటికి ఎక్కువ వెళ్ళలేదని ఇక్కడే ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఇక పిల్లలు పుట్టాక వాళ్ళే ప్రపంచం అయిపోయారని వాళ్ళకోసమే అన్నట్టుగా బ్రతికానంటూ చెప్పారు. అయితే బాబు పుట్టాక తనకు అనారోగ్యంతో బాధపడ్డాడు చాలా మంది వైద్యులకు చూపించినా గుళ్ళు తిరిగినా నయం కాలేదు.

ఎవరు ఏది చెప్పినా అక్కడికి వెళ్లడం తాయత్తులు కట్టడం చేసేదాన్ని అంటూ చెప్పారు దివ్యవాణి. అయితే మా అత్తింటి వైపు బంధువులు మాకున్న ఆస్తి కోసం మా బాబుకి చేతబడి చేసారు. ఈ విషయం ఆలస్యంగా అర్థమైంది. అదే సమయంలో బాబు వెళ్లే స్కూల్ లో టీచర్ క్రీస్తు గురించి చెప్పడంతో ఒకసారి అక్కడ కూడా ప్రయత్నిద్దామని వెళ్లాను. అలా యేసు ప్రభువు గురించి తెలుసుకున్నాక క్రిస్టియన్ గా మారాను, నా కొడుకు కూడా నయం అయింది అంటూ చెప్పారు దివ్యవాణి.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

2 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

3 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

3 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

3 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

3 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

3 hours ago