Divyavani : తెలుగింటి బాపు బొమ్మ దివ్యవాణి అంటే అప్పట్లో అందరూ ఫిదా అయ్యేవారు. చామనఛాయలో గడుసు తనం, పెద్ధ కళ్ళు వాలు జడతో అందరినీ ఆకట్టుకున్న ఈ తెలుగు బొమ్మ చేసింది కొన్ని సినిమాలే అయిన నా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయేలా ఆ సినిమాలలో పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘పెళ్లి పుస్తకం’ లో సత్యభామ గా ఆమె నటన ఎవరూ మర్చిపోలేరు. ఇక ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ వంటి సినిమాలలో కూడా అందరినీ ఆకట్టుకుంది దివ్యవాణి. హీరోయిన్ గా బాగా ఉన్నపుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన దివ్యవాణి పిల్లలు పుట్టాక హిందూ నుండి క్రిస్టియానిటీ కి మారిపోయింది. అలా ఎందుకు మారింది, ఏ విషయాలు క్రీస్తు వైపుకు ఆమెను నడిపించాయి అన్నది తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
పుట్టుకతో క్రిస్టియన్ కాదు…
దివ్యవాణి చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నా అత్తింటి వారిలో కొంతమందికి తాను నచ్చలేదట. దీంతో పెళ్లయ్యాక గొడవలు జరిగాయని అత్తత్తారింటికి వెళ్లడం తక్కువ అంటూ చెప్పారు. ఇక బంధువులలో కొంతమంది తన కొడుకు మీద బ్లాక్ మ్యాజిక్ వంటివి చేయడం వల్ల బాబు హెల్త్ పాడై ఎంతమందికి చూపించినా బాగవలేదంటూ చెప్పారు. ఆ సమయంలో బాబు చదివే స్కూల్ టీచర్ ఒకరు క్రీస్తు గురించి చెప్పడంతో చర్చికి వెళ్లి ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం మొదలు పెట్టాక బాబు కోలుకున్నాడంటూ చెప్పారు.
బైబిల్ చదవడం స్టార్ట్ చేసాక యేసు ప్రభువు గురించి తెలుసుకున్నపుడు ఆయన మన పాపాలను తొలగించడానికి ఆయన దెబ్బలు తిన్నాడు అని తెలిసినపుడు నేను యేసు గురించి తెలుసుకోవడం నాకు దొరికిన వరం అనిపించింది అంటూ చెప్పారు. క్రిస్టియానిటీ అనేది ఒక కులం కాదు మతం కాదు అంటూ చెప్పారు దివ్యవాణి.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…