దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్100 చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో హీరోయిన్ పాత్ర అద్బుతం. ఆ పాత్రను తెరకెక్కించిన తీరు.. అమోఘం అని చెప్పాలి. సినిమా అంత పెద్ద విజయవంతం కావడానికి కారణం కూడా అదే. అయితే ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
అదే ‘మహాసముద్రం’. దీనిలో సిద్దార్థ్, శర్వానంద్ నటిస్తున్నారు. మూడేళ్ల తర్వాత అతడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో అదితిరావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా జగపతిబాబు, రావు రమేష్ లాంటి సీనియర్లు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రామేష్ గూని పాత్రలో నటించడం మరో విశేషం. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
దీనిలో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా హాజరయ్యాడు. అజయ్ భూపతి తనకు రీ బర్త్ ఇచ్చాడని.. అతడు లేకపోతే నాకు ఈ హోదా ఉండేది కాదని అతడిని పొగిడారు. అంతేకాదు.. ఆర్ ఎక్స్ 100 సినిమా షూటింగ్ సమయంలోనే తను మహా సముద్రం కథ విన్నానని.. ఎంతో బాగుందన్నారు. ఈ సినిమాలో తనను తీసుకోకపోవడంతో తాను అలిగానని చమత్కరించారు.
ఇదిలా ఉండగా.. అజయ్ భూపతి గురించి మాట్లాడుతూ.. ఆర్ ఎక్స్ 100 సినిమా విడుదల సమయంలో ఈ సినిమా హిట్ కాకపోతే తాను గెదెలు కాసుకుంటానని.. చెప్పాడని.. అతడు చెప్పినట్లుగానే సినిమా బంపర్ హిట్ అయిందన్నారు. ఇప్పుడు కూడా అజయ్ అలానే చెబుతున్నాడని కార్తికేయ అన్నారు. సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం తనకు ఉందంటూ అతడు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…