హీరో ప్రభాస్ ఇటీవల ఓ విల్లాను అధిక ధరకు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్లాట్‌ను కొనుగోలు చేసి వారాల తరబడి ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ బాబు జూబ్లీహిల్స్‌లో రూ.26 కోట్లతో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారట. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 17, 2021 న జరిగినట్లు తెలిసింది. యర్రం విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.26 కోట్లతో 1442 గజాల స్థలాన్ని మహేష్‌బాబు కొనుగోలు చేసినట్లు ఇంటి భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను బట్టి తెలుస్తోంది.
రూ.1.43 కోట్లు స్టాంపు డ్యూటీ కింద.. బదిలీ కింద రూ. 39 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో నివాస స్థలానికి సంబంధించి అక్కడ ఒక్కో ఫ్లాట్ 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటాయి. దాదాపు గజం రూ.1.50లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది.
మొదట అక్కడ విక్రాంత్ రెడ్డి పాత ఇంటిని కూల్చేసి కొత్తది కడదాం అనుకున్నాడట. కాని కొత్తగా నిర్మాణ పనులు చేపట్టకుండా.. ఆ ఇంటి స్థలాన్ని మహేశ్ బాబుకు అమ్మేశాడు. అయితే ఈ ఇంటి కొనుగోలు వార్తలపై మహేష్ బాబు ఇంకా స్పందించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ తర్వాత రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…