పాన్ ఇండియా సినిమా పుష్ప రిలీజ్‌కు ఇంకా వారం రోజులే సమయం ఉంది. దీంతో ఎక్కడ చూసినా ఈ సినిమా విశేషాలే వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల అంచనాలు మరింత పెంచడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌లోని హిట్ డైరెక్టర్లు చాలామంది హాజరయ్యాయి. అందులో రాజమౌళి, కొరటాల శివ మరియు ఇంకా కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.
ఇక దీనిలో రాజమౌళి తన స్పీచ్ లో అల్లు అర్జున్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఒకరికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. పుష్ప సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. అందులో సమంత చేసిన స్పెషల్ సాంగ్ మరో ఎత్తుగా నిలుస్తోంది. ఒక్క పాటతో పుష్ప సినిమా ప్రేక్షకులు అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంది.
కేవలం లిరికల్ వీడియోకే అతి తక్కువ సమయంలో మిలియన్ల వ్యూస్‌ను సాధించి రికార్డ్ సృష్టించింది అన్నారు. ఇక ఈ ఈవెంట్లో రష్మికా మందన్నా కూడా మాట్లాడారు. అల్లు అర్జున్ తో నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. అన క్యూట్ మాటలతో సందడి చేసేశారు. ఇదిలా ఉంటే ఈ వేడుకలో ఇద్దరు బుల్లి సెలబ్రెటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారు ఎవరా అని అనుకుంటున్నారా.. అదే అల్లు అర్జున్ తనయుడు, తనయ.
అయాన్, ఆర్హ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. వీరిద్దరు వేదికపై సందడి సందడి చేశారు. వీరి హడావిడి అందరినీ ఆకట్టుకుంది. ఇక పుష్పలో వచ్చిన కొన్ని డైలాగ్స్ ను వీరిద్దరు క్యూట్ క్యూట్ గా చెప్పారు. ముందుగా మైక్ తీసుకున్న అయాన్.. ‘హలో.. తగ్గేదేలే’ అంటూ చెప్పడంతో .. ప్రేక్షకుల ఈలలతో దద్దరిల్లిపోయింది. తర్వాత అల్లు కూతురు అర్హ కూడా మైక్ తీసుకొని.. తగ్గేదేలే చెప్పడంతో విజిల్స్ మారమ్రోగాయి. ఇక వారిద్దరిని చూసిన తండ్రి, తాతయ్య(అల్లు అరవింద్) ఎంతో మురిసిపోయారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…