బిగ్ బాస్ తెలుగు 5 లో మొదట 19 మంది హౌజ్ లో అడుగుపెట్టారు. అందులో కొంతమంది తెలిసిన వాళ్లు ఉండగా.. మరికొంతమంది తెలియని వాళ్లు ఉన్నారు. ఇక రాను రాను.. వారాలు గడుస్తున్నా కొద్ది.. హౌజ్ లో ఉన్న వాళ్లంతా ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యారు.
వారు ఎవరో తెలుసుకునే పనిలో కూడా ఉన్నారు. ఇక ఈ బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. టాప్ 6 లో చోటు సంపాదించుకున్న కాజల్.. చివరి ఎలిమినేట్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చేసింది. అయితే కాజల్ ఇన్ని రోజులు ఉండటానికి కారణం అదృష్టమే అని చెప్పాలి. జెస్సీ అనారోగ్యం కారణంగా అనూహ్యంగా బయటకు వచ్చేశాడు. అటువంటి సమయంలోనే అతడు ఇద్దరి లైఫ్ ఇచ్చి వెళ్లాడు.
అందులో మానస్, కాజల్ ఉన్నారు. బయట ఓటింగ్ సరళిని బట్టి చూస్తే.. దాదాపు మానస్ సేవ్ అయి.. కాజల్ బయటకు వెళ్లాలి. కానీ ఆ రోజు ఆమె సేవ్ అయిపోయారు. తర్వాత 12వ వారంలో కూడా ఆమె రవి ఎలిమినేషన్ సమయంలో బయటకు వెళ్తుందనే అనుకున్నారు. కానీ ఎవిక్షన్ పాస్ కారణంగా మళ్లీ సేవ్ అయ్యారు. ఇలా ఆమె హౌజ్ లో కొనసాగింది. తనదైన స్ట్రాటజీలను ప్లే చేసుకుంటూ ముందుకు సాగారు.
ఇక ప్రస్తుతం కాజల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
14వారాల పాటు హౌజ్ లో ఉన్న కాజల్ వారానికి రూ. 2లక్షలు ఫిక్స్ చేశారట. ఇలా ఆమెకు 14 వారాలకు దాదాపు రూ.28 నుంచి రూ.30 లక్షల వరకు ముట్టజెప్పారనే వార్తలు వస్తున్నాయి. తనకు అప్పులు ఉన్నాయని చెప్పిన కాజల్.. దీంతో ఆ అప్పులను తీర్చనుంది. ఆమె హౌజ్ లో కూడా ఈ విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించారు కూడా.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…