నటి కృతి సనన్ ఇప్పుడు ముంబైలోని అంధేరిలో నటుడు అమితాబ్ బచ్చన్ డ్యూప్లెక్స్ ఇంటిని అద్దెకు తీసుకుంది . ఇంటి అద్దె, సెక్యూరిటీ డిపాజిట్ వివరాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ కు రెండు సంవత్సరాలకు నెలకు రూ. 10 లక్షలు అద్దె . 27వ మరియు 28వ అంతస్తులో ఉన్న అపార్ట్‌మెంట్ అంధేరీ వెస్ట్‌లోని లో ఖండ్‌వాలా రోడ్‌లోని అల్టాంటిస్ భవనంలో ఉంది. ఈ ఇల్లు నాలుగు కార్లు పార్కు చేసుకునే విధంగా ఉంది. కృతి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 60 లక్షలు చెల్లించిందట. అక్టోబర్ 16, 2021 నుండి అక్టోబర్ 15, 2023 వరకు 24 నెలలు ఆ అపార్ట్ మెంట్ ను లీజ్ కు తీసుకున్నారు.
దీనికి సంబంధించి లైసెన్స్ ఒప్పందం నవంబర్ 12 న నమోదు చేసుకున్నారు. అమితాబ్ అట్లాంటిస్‌లోని 5,184 చదరపు అడుగుల ఆస్తిని రూ. 31 కోట్లకు డిసెంబర్ 2020 లో కొనుగోలు చేశారు. అయితే అపార్ట్‌మెంట్ ఏప్రిల్ 2021లో రిజిస్టర్ చేయబడింది. అమితాబ్, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా తమ జుహు ప్రాపర్టీలలో ఒకదానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చారు. అమితాబ్ ప్రస్తుతం జల్సా అనే తన జుహు ఇంటిలో నివసిస్తున్నారు.
ఈ బంగ్లాను నిర్మాత ఎన్‌సి సిప్పీ నుంచి అమితాబ్ కొనుగోలు చేసినట్లు ఆయన ఇటీవల ట్వీట్ చేశారు. బచ్చన్ కుటుంబానికి జుహులో ప్రతీక్ష అనే మరో ఇల్లు కూడా ఉంది. అమితాబ్ తన తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్ , తేజీ బచ్చన్‌లతో కలిసి ఇక్కడ నివసించేవారు. 2007లో అభిషేక్ , ఐశ్వర్య రాయ్ వివాహం కూడా ఇక్కడే జరిగింది. కృతి గతంలో జుహులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవారు.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…