Hero Nani: టిక్కెట్ల రేట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. వాళ్లంతా తెలివితక్కువ వాళ్లే!
Hero Nani: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాని మరోసారి టికెట్ రేట్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈయన సినిమా టికెట్ల రేట్లు గురించి మాట్లాడుతూ థియేటర్ కలెక్షన్ కన్నా కిరాణాకొట్టు కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు.
ఈ విధంగా నాని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో వైసీపీ మంత్రులు సైతం నాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.అయితే తాను మాట్లాడిన మాటలను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ నాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా అంటే సుందరానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మరోసారి నాని సినిమా టికెట్లు గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను విమర్శించే వారు అందరూ కూడా తెలివితక్కువ వాళ్లే. 20..40..60 రూపాయల టికెట్ ధరలతో సినిమా ఇండస్ట్రీ మనుగడ సాధించలేదని అన్నాను. అంతేకానీ తాను సినిమా టికెట్ల రేట్లను 500 రూపాయలు పెంచమని అడగలేదు. అది కూడా తప్పు అయితే ఇది కూడా తప్పే అంటూ ఈయన టికెట్ల రేట్లు గురించి మరోసారి స్పందించారు.
ఈ క్రమంలోనే నాని సినిమా టికెట్ల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా జూన్ 10వ తేదీ విడుదల కావడంతో జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నిర్వహించనున్నారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరు కానున్నారని తెలియడంతో మరోసారి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేదికగా రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…