Hero Navadeep : నవదీప్, బిందు మాధవి ముఖ్య పాత్రలలో వస్తోన్న వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’. మదనపల్లిలో గతంలో జర్నలిజం స్ట్రింగ్ లో జరిగిన కథనాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇప్పటికే ప్రొమోషన్స్ పూర్తి చేసుకుని స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ గురించి తాజాగా వినిపిస్తున్న మాట ఈ సిరీస్ లో కూడా బూతులు ఎక్కువగా ఉన్నాయి అని. ఇటీవలే వెంకటేష్, రానా చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మీద ఎలాంటి వ్యతిరేకత ఎదరైందో అందరికీ తెలిసిందే. అలాగే తాజగా ఈ వెబ్ సిరీస్ లో కూడా బూతులు ఎక్కువయ్యాయి అంటూ వినిపిస్తున్న నేపథ్యంలో హీరో నవదీప్ ఈ సిరీస్ గురించి మాట్లాడారు.
బూతులు మాట్లాడితే చప్పట్లు కొట్టే దౌర్భాగ్యంలో ఉన్నామా…
వెబ్ సిరీస్ లో మరీ ఒక కూతురు తల్లిని కూడా బూతులు మాట్లాడేంత మన సమాజంలో ఉందా, ఎందుకని అలాంటి సంభాషణ పెట్టారు సిరీస్ లో అంటూ నవదీప్ కి ప్రశ్న ఎదురుకాగా నవదీప్ మాట్లాడుతూ ఇపుడున్న యూత్ అలాంటి కంటెంట్ ను ఇష్టపడుతున్నారు. ఒకప్పటిలా ఇపుడున్న పరిస్థితులు లేవు కాకపోతే ఒక తల్లిని అలా అనాలని బయట ఎవరికీ చెప్పడం లేదు. అది తప్పే కాకపోతే ఎంటర్టైన్మెంట్ కోణంలో చూడాలి అంతే వాటిని ఆచరించాలని కాదు అంటూ చెప్పారు. ఇపుడున్న వారికి బోల్డ్ కంటెంట్ నచ్చుతోంది. అందుకే మా సిరీస్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది అంటూ నవదీప్ చెప్పారు. ఇక రానా తో మాట్లాడినపుడు నేను మీలాంటి ఒక సిరీస్ చేశాను బోల్డ్ కంటెంట్ ఎక్కువుంది అంటూ చెప్పాడట.
ప్రస్తుతం వెబ్ సిరీస్ ల పేరుతో బూతులను చూపిస్తూ అవసరం లేకపోయినా అభ్యంతరకర భాష ఉపయోగిస్తూ మన మీద రుద్ధుతున్నారు. నిజానికి ఒకసారి ఒక వెబ్ సిరీస్ ఓకే అయ్యాక ఆర్టిస్టులు ఒకసారి అగ్రిమెంట్ మీద సైన్ చేసాక ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు చెప్పినట్లు నటించాల్సి వస్తోంది. పాశ్చాత్య సంస్కృతిలో బోల్డ్ సీన్స్ ను ఆదరించినా ఇండియాలో ఇంకా అలాంటి పరిస్థులు లేవు, కుటుంబం మొత్తం చూసే కంటెంట్ ను చూస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోల్డ్ కంటెంట్ ను ఆదరిస్తున్న కొన్ని వర్గాల వారి కోసం అంటూ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ భుజాలు తడుముకుంటున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…