బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత ఫిలిం ఇండస్ట్రీలోని నెపొటిజమ్ గురించి అందరు పెదవి విప్పుతున్నారు. అంతకు ముందునుంచే ఇది ఉన్నా సుశాంత్ మరణంతో నేపోటిజమ్ అనేది ఒక్కసారిగా బయటకి వచ్చింది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని వాళ్లను ఇండస్ట్రీలో నిర్ధాక్షణ్యంగా తొక్కేస్తున్నారని.. టాలెంట్ ఉన్నా కూడా వారికి అవకాశాలు ఇవ్వకుండా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ కూడా దీనిపై స్పందించారు.
ఏ సినిమా ఇండస్ట్రీ అయినా కచ్చితంగా నెపొటిజమ్ అనేది ఉంటుందని ఖరాఖండిగా చెప్పాడు నిఖిల్. అంతవరకూ వస్తే కేవలం సినిమాలలోనే అన్నిచోట్లా కూడా నేపోటిజమ్ ఉంది.. ప్రతి చోటా తొక్కేయడానికి చూస్తుంటారని చెప్పుకొచ్చాడు నిఖిల్. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇది మరికొంచెం ఎక్కువే ఉంటుందని.. బ్యాగ్రౌండ్ లేని వాడు ఎదుగుతుంటే తొక్కడానికి ఇక్కడ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారని నిఖచ్చిగా చెప్పాడు నిఖిల్.
అయితే అటువంటి సమయంలోనే మనం మరికొంచెం స్ట్రాంగ్ అవ్వాలి.. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎదురునిల్చొని పోరాడి కానీ ఇలా చనిపోవడం ఆ సమస్యలకు పరిష్కారం కాదు కదా అంటూ చెప్పుకొచ్చాడు. అన్ని సినిమా ఇండస్ట్రీలలో కూడా ఇది కామన్ ఎన్ని కష్టాలొచ్చినా ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం కరెక్ట్ కాదు అంటూ చెప్పాడు ఈ కుర్రహీరో.. కొత్తగా పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు నిఖిల్. త్వరలో కార్తికేయ 2 తో మన ముందుకు రానున్నాడు నిఖిల్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…