Hero Siddharth: పాన్ ఇండియా సినిమాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్… అదొక నాన్సెన్స్ అంటూ కామెంట్స్!
Hero Siddharth: పాన్ ఇండియా అనే పదం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతోంది.ఒక సినిమా అన్ని భాషలలో తెరకెక్కి విడుదల కావడంతో ఆ సినిమాని పాన్ ఇండియా సినిమాగా పిలుస్తున్నాం. ఈ క్రమంలోనే పుష్ప, RRR, కేజిఎఫ్ వంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేశాయి.అయితే ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు ఈ పాన్ ఇండియా సినిమాలు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా కాంట్రవర్సీ హీరో సిద్ధార్థ్ కూడా పాన్ ఇండియా సినిమాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాన్ ఇండియా అనేది అగౌరవం అయినది, అదొక నాన్సెన్స్ అంటూ సిద్ధార్థ్ కామెంట్ చేశారు.ఇక్కడ చేసే సినిమాలన్నీ కూడా భారతీయ సినిమాలు అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకు పిలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఈ విధంగా మాట్లాడితే పదిహేను సంవత్సరాల క్రితమే మణిశర్మ రోజా అనే సినిమాను ఇండియా సినిమాగా తెరకెక్కించి విడుదల చేశారు.తాజాగా నా స్నేహితులు కేజిఎఫ్ చిత్రాన్ని కూడా చేశారు. ఆ సినిమా చూసి నేను ఎంతో గర్వ పడుతున్నాను అంటూ సిద్దార్థ్ తెలిపారు. నచ్చిన సినిమాని ఏ భాషలో చూసే అధికారమైనా ప్రేక్షకులకు ఉంది. అందుకే పాన్ ఇండియా అనే పదాన్ని తొలగించి ఇండియన్ సినిమా అని పేరు పెట్టాలని సిద్ధార్థ వెల్లడించారు.
ఒక సినిమా తెరకెక్కతుంది అంటే ఎంతో మంది టెక్నీషియన్లు కావాలి. ఇలా వివిధ భాషలలో నటీనటులు కలిసి పనిచేయడం వల్ల ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా ఏ భాషలో తెరకెక్కిస్తే ఆ భాషా చిత్రంగా పిలవాలి కానీ పాన్ ఇండియా అని ఎందుకు బిల్డప్ ఇస్తారు.. ఇంతగా బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగా స్పందించారు. మరి సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…