1985 సంవత్సరంలో రామానాయుడు, అక్కినేని నాగేశ్వరావు గారు తమ వారసులను తెలుగు సినిమా పరిశ్రమకు హీరోలుగా పరిచయం చేయబోతున్నట్టు గా ప్రకటించారు. ఆ సందర్భంలో హీరో వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు. అప్పటికే డి.రామానాయుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన దేవత సినిమా సూపర్ హిట్ అయింది.
మళ్ళీ అదే కాంబినేషన్ లో ఒక సినిమా చేద్దామని అనుకున్నప్పుడు డి రామానాయుడు మా రెండవ అబ్బాయి వెంకటేష్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేద్దామని అడగగా దానికి రాఘవేంద్రరావుగారు ఒప్పుకున్నారు. అమెరికా నుండి వెంకటేష్ ను వెంటనే పిలిపించారు.
వెంకటేష్ ను హీరోగా తీసుకోగా మరి హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేద్దాం అనుకున్న సమయంలో హిందీ నటి కుష్బూను చిత్ర యూనిట్ సంప్రదించింది. కుష్బూ గారి నాన్నకు ఆమె తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేదు. కానీ శ్రీదేవి, జయప్రదలతో విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు రాఘవేంద్ర రావు.
కావున ఎలాగైనా రాఘవేంద్ర రావు తీయబోయే కలియుగ పాండవులు సినిమా లో కుష్బూ చేయాలనుకున్నారు. అలా 1985 చివరి మాసంలో షూటింగ్లో పాల్గొన్నారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథ రాసుకోవాలని అని ముందుగా రాఘవేంద్రరావు పరుచూరి బ్రదర్స్ సమాలోచన చేశారు. అలా మంచి కథ కుదరడంతో 1986లో సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది.
కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి వెంకటేష్ నటించిన మొదటి సినిమా కలియుగ పాండవులు కాదు దీని కంటే ముందే అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ్ నగర్ చిత్రంలో వెంకటేష్ నటించారు. ఆ సినిమాలో వెంకటేష్ నటించాలని డి.రామానాయుడు అడగగా వెయ్యి రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తానంటే వెంకటేష్ చేస్తానని ఒప్పుకోవడంతో ఆ సినిమాతో హీరో వెంకటేష్ బాల నటుడిగా కెమెరా ముందుకు రావడం జరిగింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…