విశ్వక్ సేన్ తన నటనలో మరింత పరిణితి కనబరుస్తున్నాడు. తాజాగా వచ్చిన హిట్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్ అదర గొట్టేశాడు. ఏ పాత్రలనైనా సునాయాసంగా చేయగలడు అనే విధంగా విశ్వక్ సేన్ పోలీస్ అధికారి పాత్రలో సమర్ధవంతంగా నటించాడు. దాంతో విశ్వక్ సేన్ నటనాపరంగా మంచి మార్కులు కొట్టేశాడు. అలాగే ‘హిట్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన డైరెక్టర్ శైలేష్ కొలను. డాక్టర్ వృత్తి నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు ఈ యంగ్ డైరెక్టర్. పరిచయమైన క్రొత్తలోనే శైలేష్ టాలెంట్ ను గమనించిన నేచురల్ స్టార్ నాని.. తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ‘హిట్’ సినిమాను నిర్మించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. అతి త్వరలోనే ‘హిట్’ సీక్వెల్ కూడా రాబోతోందని టాలీవుడ్ సమాచారం.
ఇక అసలు విషయానికి వస్తే.. డైరెక్టర్ శైలేష్ కొలను ఈమధ్య ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో హీరో విశ్వక్ సేన్ నిర్మాతగా కనిపించి తనకు కథ చెప్పడానికి వచ్చిన శైలేష్‌కు తనదైన స్టైల్లో చుక్కలు చూపిస్తూ.. ‘‘ఇంతకీ మన కధ విలేజా, సిటీనా, మణికొండనా, హన్మకొండనా నేను చెప్తా.. నువ్వు కాదు’’, ‘‘18Year’s, 20 Year’s, 30 Year’s నేను డిసైడ్ చేసుకుంటా.. పిచ్చోళ్లమా ప్రొడక్షన్ టీమ్ పెట్టుకుని’’ అంటూ ఒక రకమైన మేనరిజంతో ఆట పట్టించారు. ఈ వీడియోను షేర్ చేసిన శైలేష్ మాట్లాడుతూ.. ‘‘పూరి జగన్నాథ్ సార్ మా విశ్వక్ కి ఇదొకటి నేర్పించారు. అందుకే మమ్మల్ని ఇలా తొక్కేస్తున్నాడు.. బోయ్స్ చూడండ్రా మీ అన్న ఎట్లా చేస్తున్నాడో. అన్యాయం కదా.?’’ అని సరదాగా బేల మొహం పెట్టారు. శైలేష్ తండ్రికి టాలీవుడ్ లో ప్రొడక్షన్ మేనేజర్‌గా ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన దిల్ రాజు దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తున్నారు. ఇప్పుడు అదే దిల్ రాజు బ్యానర్‌లో శైలేష్ ఓ బాలీవుడ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన ‘హిట్’ చిత్రాన్నే శైలేష్ కొలను డైరెక్షన్ లో హిందీలో రీమేక్ చేస్తున్నారని లేటెస్ట్ అప్ డేట్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…