కరోనా విలయతాండవం చేస్తున్నా కళ్యాణం మాత్రం ఆగేటట్టు లేదన్నట్లుగా వివాహాది శుభకార్యాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఒకప్రక్క కరోనా భయం జనాలల్లో వున్నా పెళ్ళిళ్ళు.. పండుగల ఫంక్షన్‌ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుగుతూనే వున్నాయి. అసలే శ్రావణ మాసం కావడంతో టాలీవుడ్‌లో కూడా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈమధ్యనే టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్ పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టులో నితిన్, రానాలు పెళ్ళి పీటలపై కూర్చోబోతున్నారు. అయితే టాలీవుడ్ కు ధీటుగా కోలీవుడ్‌లోనూ పెళ్లిళ్ళ సందడి మొదలై పోయింది.
ఈమధ్యనే కోలీవుడ్ నటి వనిత 3వ వివాహం చేసుకుని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఓ కొలిక్కి రాక ముందే తాజాగా మరో నటి కూడా రెండో పెళ్లికి సిద్ధమౌతోంది. ఆమె మరెవరో కాదు. 7/జి బృందవన కాలనీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమై మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సోనియా అగర్వాల్. 2006లో ఈమె ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో 2010లో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఒంటరిగానే వుంటున్న సోనియా అగర్వాల్ త్వరలో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు కోలీవుడ్ కోడై కూస్తుంది. ఈమధ్య సోషల్ మీడియాలో సోనియా పెట్టిన ఓ పోస్ట్ ఈ రూమర్ నిజమే అనడానికి ఆధారంగా నిలుస్తుంది.
మరో 2 రోజుల్లో తనకు ఎంగేజ్‌మెంట్ జరగబోతోందని చెబుతూ ఎంగేజ్‌మెంట్ రింగ్‌లకు సంబంధించిన ఓ ఫొటోని సోనియా అగర్వాల్ షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ సోనియా అగర్వాల్ ఎంగేజ్‌మెంట్ ఎవరితో.? ఈ రూమర్ లో వున్న నిజమెంత.? అన్నది తెలియాలంటే 2 రోజులు ఆగల్సిందే.!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…