Featured

Heroine Amani : కమల్ హాసన్ ని చెంపలు వాచేలా కొట్టా… కారణం ఏంటంటే… ధన్య బాలకృష్ణని కూడా ఉతికి అరేసా…: హీరోయిన్ ఆమని

Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎమ్సీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జిగా వ్యవహారిస్తూ సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

కమల్ హాసన్ ను నిజంగానే కొట్టేసాను…

ఆమని చేసిన కొద్ది సినిమాల్లోనే లెజెండ్రి డైరెక్టర్స్ తో పనిచేసింది. అందులో కళాతపస్వి విశ్వనాధ్ గారు కూడా ఉన్నారు. ఆయన డైరెక్షన్ లో ‘శుభసంకల్పం’ సినిమాలో నటించారు ఆమని. ఆ సినిమాలో కమల్ హాసన్ కి జోడిగా నటించిన ఆమె ఒక సన్నివేశంలో కమల్ హాసన్ ని చంప మీద కొట్టాల్సి ఉండగా బాగా నటించాలి అనే ఆత్రుతతో నిజంగానే కమల్ హాసన్ చంప మీద గట్టిగా కొట్టారట.

అపుడు కమల్ హాసన్ సహజంగా చేయాలని నిజంగా కొట్టక్కర్లేదు అంటూ అన్నారట. అయితే అలా కొట్టే సీన్ లో ఇప్పటికీ అలా నిజంగానే కొడుతారట ఆమని. తాజాగా బ్రాహ్మజీ గారితో కలిసి నటిస్తున్న ఒక సినిమాలో కోడలు గా నటిస్తున్న ధన్య బాలకృష్ణ ను కూడా అలానే కొట్టారట. బాగా చేయండి అని చెప్తే అలా నిజంగానే కొట్టేస్తారా, ఎంత నేచురల్ గా నటించమంటే మాత్రం అలా కొట్టేస్తారా అని బ్రాహజీ గారు అడిగారట.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago