Heroine Amani : మా నాన్నకి ఇద్దరు భార్యలు, మొదటి భార్య పిల్లల వద్ద నాన్నను వదిలేసి… మా అమ్మాను చెన్నై తీసుకుని వెళ్ళిపోయా…: హీరోయిన్ ఆమని

Heroine Amani : ‘జంబలకిడి పంబ’ సినిమతో హీరోయిన్ గా తెలుగులో అడుగుపెట్టిన ఆమని ఆ తరువాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి నటించేందుకు స్కోప్ ఉన్న పాత్రలతో ఒదిగిపోయి నటించి సగటు తెలుగింటి మహిళగా అందరి మదిలో నిలిచిపోయింది. హీరోయిన్ గా దాదాపు అందరు హీరోలతో నటించిన ఆమని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఆ నలుగురు’ సినిమాలో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అలరిస్తున్నారు. తన పాత సినిమా విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మా నాన్న మరణం బాగా బాధించింది…

హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు మొదట్లో తండ్రి ఒప్పుకోకపోవడం ఆ తరువాత కొద్దిగా అవకాశాలు వచ్చిన తరువాత ఆమని తండ్రి కూతురుకి నిజంగానే సినిమాల్లో నటించాలనే పట్టుదల చూసి ఆమెను ఎంకరేజ్ చేశారట. ఇక తన తండ్రితో ఎక్కువ బాండింగ్ ఉండేదంటూ చెప్పిన ఆమని జీవితంలో బాగా బాధించిన విషయం తండ్రి మరణించినపుడు అంటూ చెప్పారు. ఆమని తండ్రికి ఇద్దరు భార్యలు కాగా ఆమని రెండో భార్య కూతురు. ఇంకా హీరోయిన్ గా అప్పుడే అడుగులేస్తున్న సమయంలో తండ్రి అనారోగ్యం పాలవడంతో మొదటి భార్య పిల్లల వద్దకు నాన్నాని పంపి నేను చెన్నై వెళ్లాల్సి వచ్చింది.

ఆ సమయంలో ఆర్థికంగా నేను ఇంకా మంచి స్థితిలో లేకపోవడం వల్ల కొద్ది రోజులు ఆగండి నాన్న తీసుకెళ్తా అని చెప్పేదాన్ని. మా అన్న వాళ్ళు ఆయనను బాగా చూసుకుంటారు కానీ మాతో ఎక్కువ అఫెక్షన్ ఉండటం వల్ల మాకు దూరంగా ఉండటం అలాగే అనారోగ్యం వల్ల మరణించారు అంటూ ఆమని ఎమోషనల్ అయ్యారు. నేను హీరోయిన్ గా సక్సెస్ అయ్యాక మా నాన్న చూసి ఉంటే బాగుండేదని బాగా బధేసింది అంటూ చెప్పారు.