Heroine Prema : దేవి సినిమాతో చెరగని ముద్ర వేసుకున్న నటి ప్రేమ. ధర్మచక్రం సినిమాలో వెంకటేష్ సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగమ్మాయి అనే ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడ కస్తూరి. తండ్రి టూరిజం డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా పనిచేస్తూ ఉండగా ప్రేమ గారికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన క్రికెటర్ అయ్యప్ప. ఇక ఆమె సినిమాల్లోకి వచ్చాక తెలుగు మలయాళం, తమిళం, కన్నడ సినిమాల్లో నటించిన మంచి పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ రామన్న చౌదరి అలాగే ఢీ, చిరునవ్వుతో వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుత తెలుగులో నటించడం లేదు. ఇక బెంగళూరులో నివాసముంటున్న ఆమె తన ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి వివరించారు.
చెల్లి, తమ్ముడు ఏం చేస్తారంటే…
ప్రేమ గారు ఎన్నో హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి అటు తెలుగులోనూ ఇటు మాతృ భాష కన్నడ లోనూ మంచి పేరు సంపాదించారు. సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె ప్రస్తుతం బెంగళూరు ఉంటున్నారు. ఇక తాజాగా ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబం గురించి పలు విషయాలను తెలిపారు. ప్రేమ గారి తండ్రి కర్ణాటక టూరిజం శాఖ లో డ్రైవర్ గా పనిచేసేవారట.
డిగ్రీ చదివే సమయంలోనే సినిమా ఆడిషన్స్ కోసం ప్రయత్నించగా శివ రాజ్ కుమార్ సవ్యసాచి సినిమాలో అవకాశం రాగా తండ్రి మొదట్లో అంత సుముఖంగా లేకపోయినా మళ్ళీ ప్రోత్సాహం ఇచ్చారట. అలా సినిమాల్లో అడుగుపెట్టిన ప్రేమ గారికి ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. తమ్ముడు అయ్యప్ప గారు ఫేమస్ క్రికెటర్ కాగా ప్రస్తుతం కెనరా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఇక చెల్లి పెళ్లి చేసుకుని దుబాయ్ లో సెటిల్ అవ్వగా తనకు ఇద్దరు పిల్లలు, తాను ఇంట్లోనే ఉంటుంది అంటూ చెప్పారు ప్రేమ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…