Priyamani: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ప్రియమణి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతోనూ వెబ్ సిరీస్ లలో దూసుకుపోతున్నారు. తాజాగా ఈమె నటించిన ఆర్టికల్ 370 అలాగే భామ కలాపం 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ విధంగా వరుస సక్సెస్ అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నటువంటి ఈమె తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేశారు.అయితే ఇప్పటికే ప్రియమణి గ్యారేజ్ లో ఎన్నో ఖరీదైన కోట్ల విలువచేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈమె కొనుగోలు చేసిన కారు ఏది,దాని ధర ఎంత అనే విషయానికి వస్తే జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ ని కొనుగోలు చేసింది ప్రియమణి. ఈ కారు ధర దాదాపు 74 లక్షల వరకు ఉంది. ఇలా ఈమె మరో ఖరీదైన కారును తన గ్యారేజ్ లోకి చేర్చారు.
మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ..
ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ప్రియమణి ప్రస్తుతం మాత్రం పలు కీలక పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ మదర్ క్యారెక్టర్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ప్రియమణి ఒకానొక సమయంలో బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో ఈమె బిజీగా గడుపుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…