Thamannah : నటి తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఇంత బిజీగా గడుపుతున్నారు. కేవలం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు..
ఇక ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో ఈమె అవంతిక పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇక రాజమౌళి ఒక పాత్ర కోసం ఎవరినైనా ఎంపిక చేశారు అంటే ఆ ఎంపిక చేయడం వెనుక పెద్ద స్టోరీ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్నా ఈ విషయం గురించి పలు విషయాలను వెల్లడించారు. బాహుబలి సినిమాలో రాజమౌళి గారు నన్ను అవంతిక పాత్రకు ఎంపిక చేయడానికి గల కారణం ఏంటి అనే విషయం నాకు ఇప్పటివరకు తెలియడం లేదు ఇదే విషయాన్ని నేను రాజమౌళి గారి వద్ద ఎన్నోసార్లు అడిగాను అసలు నన్ను ఎందుకు అవంతిక పాత్రకు ఎంపిక చేశారు అని అడుగుతూనే ఉన్నాను.
అవంతిక…
ఈ విధంగా నేను అవంతిక పాత్రకు ఎందుకు ఎంపిక చేశారు అని రాజమౌళిని ప్రశ్నించినప్పటికీ ఆయన మాత్రం నవ్వుతూ వెళ్లిపోతారే తప్ప ఇప్పటివరకు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అంటూ తాజాగా తమన్నా అవంతిక పాత్ర గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఇటీవల బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నారు దీంతో బాలీవుడ్ పైన ఫోకస్ కూడా ఎక్కువగా పెట్టారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…