Saipallavi: సాయి పల్లవి పరిచయం అవసరం లేని పేరు ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఈమె ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె సినిమాల పరంగా కొన్ని రూల్స్ పెట్టుకున్నారు అనే సంగతి మనకు తెలిసిందే.
తన పాత్రకు ఏ విధమైనటువంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉండకూడదు, తాను ఎక్కడ గ్లామర్ షో చేయకూడదు, హీరోలతో కలిసి రొమాంటిక్ సాంగ్స్ చేయకూడదు, లిప్ కిస్ సన్నివేశాలలో నటించకూడదన్న రూల్స్ పెట్టుకుని కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే ఈమె నటిస్తూ ఉన్నారు.
ఇలా సినిమాల పరంగా ఎన్నో రూల్స్ పెట్టుకున్నటువంటి సాయి పల్లవి మొదటిసారి రూల్స్ బ్రేక్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈమె ఒక హీరోతో కలిసి రొమాంటిక్ సాంగ్ చేయబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో హీరో శివ కార్తికేయన్ ఎంతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అమరన్..
వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా పేరు అమరన్. ఇక ఇందులో శివ కార్తికేయన్ సైనికుడిగా నటించగా ఆయన భార్య పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారని ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాక కేవలం ఒక సాంగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది. ఇక వీరి కాంబినేషన్లో ఓ రొమాంటిక్ సాంగ్ రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు సాయి పల్లవి ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ చేయలేదు మొదటిసారి ఇలాంటి పాటలో నటించబోతున్నారని తెలిసి ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…