ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి హైకోర్టు మొట్టికాయలు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు జగన్ సర్కార్ కు భారీ షాక్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు న్యాయమూర్తులకు సంబంధించి ఘాటు విమర్శలు చేశారు. అనంతరం కొందరు అధికార పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో న్యాయమూర్తులను కించపరిచే విధంగా పోస్టులు చేశారు.
కొన్ని రోజుల క్రితం ఆ పోస్టుల గురించి విచారణ చేయాలని ఏపీ హైకోర్టు సీఐడీకి సూచించింది. అయితే సీఐడీ విచారణ సరిగ్గా చేయకపోవడంతో హైకోర్టు సీఐడీ విచారణ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై, సీఐడీ విచారణ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీకి వ్యతిరేక పోస్టుల విషయంలో సీఐడీ బాగా పని చేస్తోందని.. న్యాయమూర్తులపై పోస్టుల విచారణలో మాత్రం ఆ విధంగా స్పందించడం లేదని తెలిపింది.
అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని కోరింది. మొత్తం 19 మంది పేర్లను ఫిర్యాదు చేస్తే వారిలో కేవలం 9 మందిపై మాత్రమే కేసులు నమోదు కావడంలో అర్థమేంటని ప్రశ్నించింది. న్యాయ వ్యవస్థపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని హైకోర్టు కీలక సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ సీబీఐకి కేసును అప్పగించడంలో గల అభ్యంతరాలను చెప్పాలని కోరింది.
సీఐడీతో పోల్చి చూస్తే సీబీఐకు సాంకేతిక పరిజ్ఞానం, తగిన వనరులు, విభాగాలు, సిబ్బంది ఎక్కువ మంది ఉంటారని పేర్కొంది. చివరకు కేసును సీబీఐకు అప్పగిస్తున్నామని వెల్లడించింది. జగన్ సర్కార్ ఇప్పటికే పలువురు న్యాయమూర్తుల గురించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే హైకోర్టు అధికార పార్టీకి షాక్ ఇవ్వడం గమనార్హం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…