Featured

కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. వాటిపై సజీవంగా నాలుగు వారాలు!!

ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి గురించి పరిశోధనలు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఫోన్ స్క్రీన్లు, స్టీల్ వ‌స్తువులపై కరోనా వైరస్ నాలుగు వారాల పాటు జీవిస్తుందని తెలిపారు. ప్రజలు ఇప్పటివరకు ఊహించిన దాని కంటే వైరస్ ఎక్కువ కాలం జీవిస్తూ ఉండటం గమనార్హం.

 

ఆస్ట్రేలియాకు చెందిన నేష‌న‌ల్ సైన్స్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. వస్తువులతో పాటు కరెన్సీ నోట్లపై సైతం కరోనా వైరస్ జీవించగలదని తేల్చారు. ల్యాబ్‌లో అనేక ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తలు ఈ ఫలితాలను వెల్లడించారు. నిజానికి కరోనా వైరస్ నోటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. నోటి ద్వారా బయటకు వచ్చిన వైరస్ గాలిలో తుంపరల వల్ల కూడా ప్రబలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికాకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ వస్తువుల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. గతంలో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వారం కంటే తక్కువ రోజులఏ వైరస్ వస్తువులపై జీవిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ప్రజల్లో భయాందోళనను మరింత పెంచే విధంగా ఉండటం గమనార్హం.

వైరాల‌జీ జ‌ర్న‌ల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను ప్రచురించారు. వేడి వాతావ‌ర‌ణంలో కరోనా వైరస్ ఎక్కువ కాలం జీవించదని శాస్త్రవేత్తలు తేల్చారు. 40 డిగ్రీల సెంటిగ్రేడ్ మ‌ధ్య ఒక రోజు కాలంలో ఈ వైరస్ వ్యాప్తి జరగడం లేదని చెప్పారు. 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వాతావరణంలో 28 రోజులు వైరస్ జీవిస్తుందని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

22 minutes ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

30 minutes ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

34 minutes ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

2 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

2 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

2 hours ago