కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత పేదలకు ప్రయోజనం చేకూర్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి దేశంలో ఉన్న వ్యాపారులు, ఉద్యోగులపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఎప్పుడూ నష్టాల ఊసే తెలియని వ్యాపారాలు సైతం నష్టాల బాట పట్టాయి. దేశంలో ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోవడంతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కరోనా వ్యాప్తి వల్ల దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయి కుటుంబ పోషణ కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో మోదీ సర్కార్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పేదలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మరోసారి పనిదినాలను పెంచింది. కేంద్రం దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం కరోనా విజృంభణ తరువాత ఉపాధి హామీ పథకానికి భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తోంది. దీంతో కేంద్రం పని దినాలను ఏకంగా 281 పనిదినాల నుంచి 300 పనిదినాలకు పెంచింది. అయితే కేంద్రం ఈ పనిదినాలను ఏకంగా 320 పనిదినాలకు పెంచే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. పనిదినాలతో పాటు కేంద్రం ఉపాధి హామీ అవకాశాలను కూడా పెంచింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరో ఎనిమిది పెద్ద రాష్ట్రాలు పనిదినాలను పెంచాలని కోరడంతో కేంద్రం మరింత పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో కేంద్రం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేంద్రం పని దినాలను పెంచే దిశగా అడుగులు వేయడంపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…