Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎలాంటి అభిమానం ఉందో మనకు తెలిసిందే. నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇలాంటి తరుణంలో ఈయనకు సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం ఎంతో భద్రతలను ఏర్పాటు చేసింది.
పవన్ కళ్యాణ్ సినీ నటుడుగా ఉన్నప్పుడే ఈయన బయటకు వస్తే హై సెక్యూరిటీతో బయటకు వస్తారు. ఇక ఈయన ఇప్పటివరకు ప్రవేట్ సెక్యూరిటీతో బయట తిరిగేవారు. ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఉపముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ & టెక్నాలజీ వంటి కీలక శాఖల బాధ్యతలను తీసుకున్నారు.
ఇలాంటి తరుణంలో ఈయనకు మరింత సెక్యూరిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ తనకు థ్రెట్ ఉందని, కొంతమంది అనుమానాస్పదంగా తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఆరోపణలు చేశారు ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని తనకు హై సెక్యూరిటీ కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
భారీ సెక్యూరిటీ..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఆయన కాన్వాయ్ లో ఒక ఎస్పీజీ కమాండో ఇంకా రెండు ఎన్.ఎస్.జీ కామాండోలతో కూడిన 4 కార్లు ఉంటాయని తెలుస్తుంది.ఇంకా అలాగే రెండు సీఆర్పీఎఫ్ సిబ్బంది సెక్యూరిటీతో రెండు వాహనాలు, ఒక జామర్ వాహనం కూడా ఉంటాయని తెలుస్తుంది. ఈయన ఒక నటుడిగా, ఉపముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో ఈయనకు భారీ స్థాయిలో సెక్యూరిటీ కల్పించాలని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…