Categories: FeaturedGeneral News

“భారత్‌ మాతా కీ జై” అనే నినాదం వెనుక దాగివున్న పోరాట గాధ !!

భారత్‌ మాతా కీ జై అంటే.. అదొక అది యుద్ధ నినాదం.. ఈ నినాదం 1905లో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజుల్లో బెంగాల్‌లో బ్రిటిష్‌ వారు హిందు, ముస్లింలను విభజించి పాలించాలనుకున్నారు. అప్పుడే భారత్ మాతాకీ జై అనే నినాదం పుట్టుకొచ్చింది. దీనికి బెంగాల్‌కు చెందిన ప్రముఖ కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మేనల్లుడు అబనీంద్రనాథ్‌ ఠాగూర్‌ వేసిన భరత మాత పెయింటింగే కారణం. ఆ పెయింటింగ్ పుట్టుక వెనుక ఓ అద్భుతమైన కథే దాగి ఉంది.

1905లో బెంగాల్‌లో భారత వైశ్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ హిందు, ముస్లింలను మతపరంగా విడగొట్టి వేర్వేరు ప్రాంతాలలో వారిని ఉంచి పరిపాలించాలని అనుకున్నాడు. కానీ దీని వెనుక ఉన్న కుట్రను ప్రజలు పసిగట్టారు. దీంతో భారత స్వాతంత్ర్య ఉద్యమం ఆ ప్రాంతంలో భారీగా ఎగిసింది. 1905లో బ్రిటీషు పాలకులు భారతదేశ ప్రజల ఐక్యతను దెబ్బతీయాలనే దుర్బుద్ధితో బెంగాల్‌ను విభజించారు. దానికి వ్యతిరేకంగా దేశాన్ని విడగొట్టవద్దంటూ భారత్‌ మాతాకీ జై అంటూ నినదించారు. హిందువులు, ముస్లింలు ఉమ్మడిగా బెంగాల్‌ విభజనను వ్యతిరేకిస్తూ చేసిన మహత్తర పోరాటం ఇది. బ్రిటీషు పాలకులకు చెమటలు పట్టించిన పోరాటం ఇది.

jawaharlal nehru

నాడు దేశమంతా ఒకేజాతిగా భావిస్తూ స్వతంత్రసమరంలో చేయిచేయి, భుజంభుజం కలిపి పోరాడుతుంటే హిందూముస్లింలను వేరు చేసి బ్రిటీషువారికి మహోపకారం చేశారు. ఒకసారి నెహ్రూ స్వాతంత్య్ర సభలో మాట్లాడుతుండగా భారతమాతాకీ జై అంటూ బిగ్గరగా అరిచారు. అంటే అర్థమేమిటని నెహ్రూ వారినడిగారట. వారంతా నోరెళ్లపెట్టారు. భారతమాతంటే మట్టి, నీళ్లు, పర్వతాలు కాదు. ప్రజలు, వారి విముక్తే దేశవిముక్తి. భారతమాతాకీ జై అంటే ప్రజలకు స్వాతంత్య్రం రావడమేనని వివరించారట. డిస్కవరీ ఆఫ్‌ ఇండియాలో నెహ్రూ స్వయంగా రాసుకున్న విషయాలివి. తెలుగు కవి గురజాడ కూడా ఇదే భావన అందించాడు మనకు. కానీ ఆర్‌యస్‌యస్‌ దృష్టిలో భారతమాతంటే కొండలు, రాళ్లు, రప్పలు, సరిహద్దులు మాత్రమే. ఆర్‌యస్‌యస్‌ పుస్తకాల్లో భారతమాత బొమ్మను దుర్గామాతను పోలి ఉండే విధంగా ప్రచురిస్తారు. దాన్ని చూడగానే ఇతర మతస్తులకు భారతమాతంటే హిందూ దేవతగా కనిపిస్తుంది. రౌద్రంగా, చేతిలో త్రిశూలం, పక్కలో సింహంతో భారతమాత కనిపిస్తుంది.

bankim chandra chatterjee

ఇదిలా వుంటే.. 1875 లో బంకిం చంద్ర ఛటర్జీ రాసిన వందే మాతరం గీతాన్ని ప్రేరణగా తీసుకుని దేశాన్ని భరతమాతగా వర్ణిస్తూ అబనీంద్ర ఠాగూర్‌ భరత మాతకు ఒక రూపం ఇచ్చారు. దీంతో భరత మాత పెయింటింగ్‌ ఆవిష్కృతమైంది. అందులో ఆ దేవత కాషాయ వస్త్రాలను ధరించి 4 చేతులను కలిగి ఉంటుంది. చేతుల్లో పుస్తకం, వరి కంకులు, మాల, తెల్లని వస్త్రాన్ని పట్టుకుని ఉంటుంది.

అయితే ఆ పెయింటింగ్‌ను చూసిన స్వామి వివేకానంద శిష్యురాలు నివేదిత అందులో ఏదో శక్తి దాగుందని గ్రహించింది. దీంతో ఆమె ఆ పెయింటింగ్‌లో ఉన్న భరతమాత బొమ్మతో పోస్టర్లను ప్రింట్‌ చేయించి బెంగాల్‌ అంతటా వాటిని ప్రచారం చేయించింది. గోడలపై వాటిని అతికింపజేసింది. బ్యానర్లను కట్టించింది. ఈ క్రమంలో 1909 వరకు భరత మాత చిత్రానికి దేశమంతటా ప్రాచుర్యం లభించింది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లో భరతమాత చిత్రాలతో భారత్‌ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ స్వాతంత్ర్యం కోసం ఆందోళనలు చేపట్టారు. అలాగే మద్రాస్‌లో నివేదిత శిష్యులు ఆ బొమ్మను విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే బాంబే, పంజాబ్‌లలోనూ లోక్‌మాన్య తిలక్‌, లాలా లజపతి రాయ్‌లు భరతమాత చిత్రంతో ఆందోళనలు చేపట్టారు.

Bharat Mata Mandir

అలా భరతమాత చిత్రం, భారత్‌ మాతా కీ జై అనే నినాదం.. భారతదేశమంతటా విస్తరించాయి. 1918లో బనారస్‌లో భరతమాత మందిరాన్ని నిర్మించారు. దానిని మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌, అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌లు ఆవిష్కరించారు. కాలగమనంలో మనకు స్వాతంత్ర్యాన్ని సాధించడంలో విశిష్ట కృషి చేసిన గాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి నాయకులతోపాటు భరతమాత్ర చిత్రపటాన్ని కూడా పూజించడం మొదలు పెట్టారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago