“చెయ్యి చూశావా ఎంత రఫ్ గా వుందో.. రప్ఫాడించేస్తా” అంటూ మెగాస్టార్ చిరంజీవిలాగ మన తెలుగు సినిమాల్లోని హీరోలు పంచ్ డైలాగ్స్ విసురుతూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్లు కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే డైలాగ్స్ రాస్తున్నారు మన సినీ రచయితలు. ఈ క్రమంలో చాలా మంది హీరోయిన్లు క్రేజీ డైలాగ్స్ చెప్పి ఆడియన్స్ ని మెప్పించారు.
సినిమాలో హీరోయిన్ల క్యారెక్టర్ ని ఒక్క డైలాగ్ లో చెప్పేలా మన రచయితలు రాసిన డైలాగ్స్ థియేటర్లలో బాగా పేలాయి. అలా వన్ లైన్ డైలాగ్స్ తో గుర్తుండిపోయిన హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
సదా – ‘జయం’ సినిమాలో ‘వెళ్లవయ్యా.. వెళ్లు వెళ్లు..’ అనే ఒకే ఒక్కడైలాగ్ సదాకి స్టార్ డం తీసుకొచ్చింది. నేటికీ సదాని ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే ఈ డైలాగ్ మహత్యమేనని చెప్పవచ్చు.
రెజీనా – ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో ఈ బ్యూటీ సీత క్యారెక్టర్ లో నటించింది. ఆ పాత్రకి తగ్గట్లు.. ‘సీతతో అంత ఈజీ కాదు’ అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల మదిని దోచేసింది.
సాయి పల్లవి – ‘ఫిదా’ సినిమాలో భానుమతిగా అందరి హృదయాలను కొల్లగొట్టిన సాయి పల్లవి ‘భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల..’ అంటూ చేసిన రచ్చను ఇప్పట్లో మర్చిపోలేం.
తమన్నా – ఈ మిల్క్ బ్యూటీ నటించిన ‘100% లవ్’ సినిమాలో ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ అంటూ చెప్పే డైలాగ్ ఇప్పటికీ హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే డైలాగ్ ను ఓ సినిమాకి టైటిల్ గా పెట్టుకొని సినిమా కూడా చేస్తుందంటే ఈ ఒక్క డైలాగ్ లో ఎంత పవరుందో అర్ధం చేసుకోవచ్చు.
ఛార్మి – ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో తన మేనరిజంకి తగ్గట్లు ‘పద్దు.. శివంగి.. ఆడపులి’ అంటూ ఛార్మి డైలాగ్ చెప్తుంటే మాస్ ప్రేక్షకులు తెగ పిచ్చెక్కిపోయారంటే నమ్మశక్యంగా లేదు కదూ…
శ్వేతాబసు ప్రసాద్ – ‘కొత్తబంగారు లోకం’ సినిమాలో ‘ఏక్క..డా..’ అంటూ సాగదీసి మరీ డైలాగ్ చెబుతుంది శ్వేతాబసు. ఈ ఒక్క డైలాగ్ ఈమెకి యూత్ లో మాంఛి క్రేజ్ ను తీసుకొచ్చింది.
కాజల్ – ‘సీత’ సినిమాలో కాజల్ నటనకి అందరికీ ఫిదా అవ్వాల్సిందే.. ‘సీత.. నేను గీసిందే గీత’ అంటూ సినిమాలో కాజల్ చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
నభా నటేష్ – ‘సిరి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్’ అంటూ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో నభా చెప్పే డైలాగ్ తన క్యారెక్టర్ లోని అమాయకత్వాన్ని చూపించింది.
పూజా హెగ్డే – ‘అరవింద సమేత’ సినిమాలో ‘నాకు కొంచెం స్పేస్ కావాలి’ అంటూ ప్రతీసారి పూజా చెప్పే డైలాగ్ మెప్పించింది. బయట చాలామంది ఈ డైలాగ్ ని వాడుతున్నారు.
మెహ్రీన్ – ‘నేను చెప్పానా.. నీకు చెప్పానా’ అంటూ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాలో, ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మెహ్రీన్.
రకుల్ ప్రీత్ సింగ్ – ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాలో తన పాత్రకి తగ్గట్లు ‘ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ’ అంటూ హీరో మీద కౌంటర్లు వేసింది రకుల్.
రష్మిక – రీసెంట్ గా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ‘మీకు అర్ధమవుతుందా..?’ అంటూ రష్మిక చేసిన రచ్చ ఇప్పట్లో మర్చిపోలేం.
చూశారుగా.. డైలాగ్స్ లో వున్న పవర్.. ఒక్క డైలాగ్ సినిమా హీరోల లైఫ్ నే కాదు.. హీరోయిన్ల లైఫ్ ని కూడా మార్చేస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలేమో.!????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…